Site icon NTV Telugu

Hyderabad CP: న్యూ ఇయర్ వేడుకలపై నిఘా.. ఈవెంట్స్, పబ్స్ కు రాత్రి ఒకటి వరకే పర్మిషన్..

Hyd Cp

Hyd Cp

New Year celebrations: ఇయర్ ఎండింగ్ క్రైమ్ రివ్యూ పై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ లో 2 శాతం నేరాల సంఖ్య పెరిగిందన్నారు. దాదాపు 8 రకాల నేరాలు బాగా పెరిగిపోయాయి.. ఆర్ధిక , సైబర్ నేరాలు శాతం విపరీతంగా పెరిగిపోయాయని ఆయన చెప్పారు. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.. రాష్ట్రం ఏర్పాటు అయి 10 ఏళ్ళు పూర్తి అయింది.. ఎఫ్ఐఆర్లు 24, 821 నమోదు కాగా, గత ఏడాదితో పోలిస్తే 2 శాతం క్రైమ్ రేట్ పెరిగింది. 9 శాతం మేర పెరిగిన దోపిడీలు, మహిళలపై 12 శాతం నేరాలు పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే చిన్నారులపై 12శాతం నేరాలు తగ్గాయి. వివిధ కేసులో నష్టం జరిగిన విలువ 38 కోట్ల రూపాయలు.. పోయిన సోమ్ములో 75 శాతం రికవరీ చేశారు. హత్యలు 79, రేప్ కేసులు 403, కిడ్నాప్లు 242, చీటింగ్ కేసులు 4909 నమోదు అయ్యాయన్నారు. రోడ్డు ప్రమాదాలు 2637, హత్యాయత్నాలు 262, చోరీలు 91 నమోదు అయ్యాయని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Read Also: Salaar: నిజంగానే ఖాన్సార్ నగరం ఉంది.. ఏ దేశంలోనో తెలుసా?

ఈ ఏడాది 63శాతం నేరస్తులకు శిక్షలు పడ్డాయని సీపీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 13 కేసులో 13 మందికి జీవిత ఖైదీ శిక్షలు.. గత ఏడాదితో పోల్చితే 2 శాతం క్రైమ్ కేసులు పెరిగినట్లు చెప్పారు. అలాగే, డ్రగ్స్ కేసులో నార్కోటిక్ బ్యూరో దృష్టి పెడుతుంది.. స్నిపర్ డాగ్స్ ద్వారా మాఫియాను వెతికి పట్టుకుంటాం.. పబ్స్ లో డ్రగ్స్ దొరికితే కఠిన చర్యలు తీసుకుంటాం.. గతంలో దొరకకపోయినా.. ఇప్పుడు సమచారం వస్తే చాలు వెరిఫై చేసి వాళ్ళ వ్యాపారాన్ని పూర్తిగా క్లోజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో తిరిగి పబ్స్ ఓపెన్ చేయించే ప్రసక్తి ఉండదు.. న్యూ ఇయర్ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే తగిన చర్యలు తీసుకుంటాని సీపీ పేర్కొన్నారు. రాత్రి ఒంటి గంట వరకు మాత్రమే ఈవెంట్స్, పబ్ లకు అనుమతి ఉందని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 12.30 నుంచే కష్టమర్లను బయటకి పంపాలి.. న్యూ ఇయర్ వేడుకల్లో ఎక్కడైనా డ్రగ్స్ సేవించిన, సప్లై చేసిన కఠిన చర్యలు తీసుకుంటాం.. న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెంచుతున్నాం.. నిబంధనలు ఉల్లంగిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఆయన వెల్లడించారు.

Exit mobile version