NTV Telugu Site icon

Hyderabad CP: ధర్నా చౌక్ లో ఎవరైనా ఆందోళనలు చేయొచ్చు.. రోడ్లు మూసివేసే ప్రసక్తి లేదు..

Hyd Cp

Hyd Cp

ధర్నా చౌక్ ని యధావిధిగా కొనసాగించేందుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్త శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇవాళ ధర్నా చౌక్ ని ఆయన పరిశీలించారు. ధర్నా చౌక్ పైన డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం కొనసాగింది. ఈ మీటింగ్ తర్వాత హైదరాబాద్ సీపీ మాట్లాడుతూ.. ధర్నా చౌక్ లో సౌకర్యాలు మెరుగు పరిచేందుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు. ధర్నా చౌక్ లో ఎవరైనా ఆందోళనలు చేపట్టవచ్చు.. ధర్నాలు నడుస్తున్న సమయంలో రోడ్లను మూసివేసే ప్రసక్తి లేదు అని సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

Read Also: Tipu Sultan Row: మరోసారి “టిప్పు సుల్తాన్” వివాదం.. మైసూర్ ఎయిర్‌పోర్టు పేరు మార్పు ప్రతిపాదన..

ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా ధర్నాలు నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తామని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ధర్నాలు చేపట్టవచ్చు.. నగరంలో రెండు రోజులుగా ట్రాఫిక్ వ్యవహారంపై చర్చ జరిగింది.. అసెంబ్లీ నడుస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ కొద్దిగా అంతరాయం ఏర్పడింది.. ట్రాఫిక్ ను పూర్తిగా క్లియర్ చేసేందుకు మా సిబ్బంది ఎప్పటికప్పుడు రోడ్ల మీద ఉన్నారు అంటూ ఆయన పేర్కొన్నారు. ప్రజావాణి కోసం వచ్చే ఫిర్యాదు దారులకు సౌకర్యాలు మెరుగు పరుస్తున్నారు..10 గంటలకు ఫిర్యాదులు స్వీకరించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు అని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.