హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో 50 ట్రాఫిక్ పెట్రోలింగ్ బైక్‌లను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు. సెక్యూరిటీ కౌన్సిల్స్ ఆధ్వర్యంలో 100 మంది ట్రాఫిక్ మార్షల్స్ విధులు నిర్వర్తించనున్నారు. ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను బలోపేతం చేయడానికి వంద మంది మార్షల్స్‌లకు 50 బైక్‌లను సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేసింది. పబ్లిక్, ప్రైవేట్ పార్ట్‌నర్ షిప్‌లో భాగంగా ట్రాఫిక్‌ని క్రమబద్ధీకరించడంతో పాటు వాహనాలు సజావుగా, సాఫీగా వెళ్లేందుకు ట్రాఫిక్ పెట్రోలింగ్ బైకులు సహకరించనున్నాయి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్ షిప్‌లో వాహనాలను అందించడం ద్వారా ఇంకా మంచి సర్వీసు అందించగలుగుతాం అని సీవీ ఆనంద్ ధీమా వ్యక్తం చేశారు.
‘ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్ని వాహనాలు ఇచ్చినా పోలీస్ శాఖకు సరిపోవు. అందుకే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్ షిప్‌లో వాహనాలను అందించడం ద్వారా ఇంకా మంచిగా సర్వీసు అందించగలుగుతాం. నగరంలో 650 జంక్షన్లు ఉన్నాయి. రోజు రోజుకు హైదరాబాద్లో వాహనాలు రద్దీ పెరుగుతుంది. నగరంలో గంటకు 18 కిమి వేగం నుంచి 23 కిమి వరకు పెరిగింది. దేశంలోనే మొదటిసారి ట్రాన్జెండర్లను ట్రాఫిక్‌లో నియమించాము. జీహెచ్ఎంసీతో పాటు ఇతర శాఖల్లోనూ రాబోయే రోజుల్లో ట్రాన్స్ జెండర్లకు ఉపాధి కల్పించడం కోసం చర్యలు చేపడుతుంది ప్రభుత్వం. ట్రాఫిక్ మార్షల్స్ సంబంధిత పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్సైలు పర్యవేక్షణలో పనిచేస్తారు. ట్రాఫిక్ మార్షల్స్‌కు చాలా ఆలోచించి చర్చించిన తరువాతే ట్రాఫిక్ సిబ్బంది డ్రెస్లను ఇచ్చాము’ అని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ చెప్పారు.
Also Read: Maoist Sunitha: లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత సునీత!
‘రాబోయే రోజుల్లో 500 మందికి ట్రాఫిక్ మార్షల్స్ పెరుగుతాయని అనుకుంటున్నాం. ట్రాఫిక్ మార్షల్స్ చాలా బాధ్యతగా వ్యవహరించాలి. తప్పు చేయకూడదన్న భావనతోనే విధులు నిర్వహించాలి. ట్రాఫిక్ డిపార్ట్మెంట్, పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలి. ట్రాఫిక్ పెట్రోలింగ్ బైక్‌లనుకు క్యాష్ బోర్డు కెమెరాలు ఏర్పాటు చేశాము. బైక్ నడుపుతున్న వారికి బాడీవేర్ కెమెరా ఉంటుంది. మూడు క్రేన్స్ కూడా అందుబాటులోకి తెచ్చాము’ అని హైదరాబాద్ సీపీ తెలిపారు. ట్రాఫిక్ మార్షల్స్ రద్దీగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు సహాయపడనున్నారు. వీరు ట్రాఫిక్ పోలీసులకు సహాయకులుగా ఉండి.. ట్రాఫిక్ జామ్ లను తగ్గించడానికి, ట్రాఫిక్ నియమాలను పాటించేలా చూడటానికి పనిచేస్తారు.
