కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో హైదరాబాద్ కమిషనరేట్ వార్షిక నేర నివేదికపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియా సమావేశం నిర్వహించారు. 2024వ సంవత్సరం చాలా ప్రశాంతంగా గడిచింది.. హైదరాబాద్ కమిషనర్ పరిధిలో అన్ని పండగలు ప్రశాంతంగా ముగిసాయని తెలిపారు. హోంగార్డ్ నుండి సీపీ వరకు అందరూ కష్టపడ్డారు.. అందరికీ కృతజ్ఞతలు అని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు కూడా విజయవంతంగా పూర్తి చేసామని తెలిపారు. క్రైమ్ రేట్ ఈ సంవత్సరం కొంత పెరిగింద సీపీ వెల్లడించారు. క్రైమ్ జరిగినప్పుడు ఏడు నిమిషాల కన్నా తక్కువ సమయానికి చేరుకుంటున్నామని తెలిపారు. 129 పెట్రోల్ కార్స్, 210 బ్లూ కోల్ట్స్ వాహనాలు, ఇంటర్ సెట్టర్ వాహనాలను కూడా విజిబుల్ పోలీసింగ్‌లో భాగస్వామ్యం చేశామన్నారు.
PM Modi: ప్రధాని మోడీకి కువైట్ అత్యున్నత పురస్కారం..
గణేష్ ఉత్సవాలు తర్వాత సౌండ్ పొల్యూషన్ పై చర్యలు తీసుకున్నామని సీపీ తెలిపారు. ఈ చర్యపై నగరవాసుల నుంచి మద్దతు లభించింది.. ముత్యాలమ్మ గుడి ఇష్యూ తర్వాత నిరాశ్రయులను షెల్టర్ హోమ్‌కు తరలించామని అన్నారు. ఈ సంవత్సరం మొత్తం 35,944 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి.. గత సంవత్సరం కంటే ఈసారి 45 శాతం ఎఫ్ఐఆర్‌ల శాతం పెరిగిందని తెలిపారు. మర్డర్లు 13 శాతం తగ్గాయి.. అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా తగ్గాయని వెల్లడించారు. కిడ్నాప్ కేసుల్లో 88 శాతం పెరుగుదల ఉంది.. ఆస్తికి సంబంధించిన నేరాల్లో 67 శాతం పెరుగుదల ఉంది.. నేరాలు డిటెక్ట్ చేసే పర్సంటేజ్ 59 శాతం.. రికవరీ పర్సంటేజ్ 58 శాతం ఉందని తెలిపారు. అలాగే.. 36 రకాల సైబర్ నేరాలు ఈ సంవత్సరం చూశామని చెప్పారు. డిజిటల్ అరెస్టులు ఎక్కువ శాతం రిపోర్ట్ అవుతున్నాయి.. 4042 సైబర్ క్రైమ్‌లు నమోదు చేశాం.. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయని అన్నారు. రూ.297 కోట్లు సైబర్ నేరాల్లో పోగొట్టుకున్నారు.. రూ.42 కోట్లు సైబర్ నెరకాల నుండి రికవరీ చేశామని అన్నారు. సైబర్ నేరాల్లో 30 శాతం కేసులు డిటెక్షన్ పెరుగుదల ఉంది.. 500 మంది కన్నా ఎక్కువ సైబర్ క్రిమినల్స్‌ను అరెస్ట్ చేశామని సీపీ తెలిపారు.
Vishnumurthy: అల్లు అర్జున్ ఓ రిమాండ్ ఖైదీ.. ముద్దాయి ప్రెస్ మీట్ పెట్టొచ్చా..!
నగరంలో ఆపరేషన్ రోప్‌ను తీవ్రతరం చేశామని సీపీ సీవీ ఆనంద్ అన్నారు. జీహెచ్ఎంసీ, లా అండ్ ఆర్డర్ పోలీసుల సహకారంతో ఆపరేషన్ రోప్‌ను విస్తృతంగా చేస్తున్నామన్నారు. సుప్రీం కోర్టు ఆర్డర్స్ ప్రకారం టౌన్ వెండింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తామని సీపీ తెలిపారు. ప్రజా ప్రతినిధులను ఈ కమిటీల్లో భాగస్వామ్యం చేసి ట్రాఫిక్ సమస్యను అధిగమిస్తామని చెప్పారు. ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కట్టడి చేయడంలో టాస్క్ ఫోర్స్ ముందుంది.. రౌడీలపై టాస్క్‌ఫోర్స్ ఉక్కు పాదం మోపుతోందని పేర్కొన్నారు. ఐటీ విభాగాన్ని కూడా బలోపేతం చేస్తాం.. నేరాలు గుర్తించడంలో సీసీటీవీల పాత్ర ముఖ్యమైనదని తెలిపారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ మేనేజ్మెంట్ కోసం డ్రోన్స్ వినియోగిస్తామన్నారు. మరోవైపు.. ఏసీబీ కేసులో 30 మంది పోలీసులు వివిధ విభాగాల్లో లంచం తీసుకుంటూ సస్పెండ్ అయ్యారన్నారు.
వచ్చిన ప్రతి కేసును వెంటనే ఎఫ్ఐఆర్ చేయడంతో పాటు అరెస్టులు చేస్తున్నామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.