Hyderabad Police: దీపావళి రోజు ఆ సమయంలోనే క్రాకర్స్ పేల్చాలి.. హైదరాబాద్ పోలీస్ ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళి సందర్భంగా పటాకులు పేల్చడంపై హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రజలకు మార్గదర్శకాలు జారీ చేశారు. పర్యావరణ అనుకూలమైన, సురక్షితమైన దీపావళిని జరుపుకోవడానికి ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని.. చట్ట అమలుకు సహకరించాలని కోరారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో దీపావళి రోజు రాత్రి 8 నుండి 10 గంటల వరకు క్రాకర్లు పేల్చాలని నోటీసుల్లో తెలిపారు. అంతేకాకుండా.. రోడ్లు, పబ్లిక్ ప్రాంతాలలో రాత్రి 8 నుంచి 10 మధ్య తప్పితే మిగతా సమయాల్లో పరిమితికి మించి శబ్ధం వచ్చే టపాసులు కాల్చొద్దని చెప్పారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలెవరూ మామూలు టపాసులు కాల్చొద్దని కోరారు. దీని వల్ల వాయు, శబ్ద కాలుష్యం పెరుగుతుందని తెలిపారు. బదులుగా గ్రీన్ కాకర్స్ తోనే పండుగ చేసుకోవాలని సూచించారు. ఈనెల 12 నుంచి 15 వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపారు. పై ఆదేశాలను ఉల్లంఘించిన ఎవరైనా హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టం, 1348 ఫాస్లీ (నం. IX) అమలులో ఉన్న ఇతర సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.
Read Also: D.K.Shivakumar: ఎప్పుడూ మమ్మల్ని తలుచుకోనిదే కేసీఆర్ నిద్రపోడు
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ఇదిలా ఉంటే.. దీపావళి రోజు ఫైర్‌క్రాకర్స్ విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. దేశంలో అన్ని రకాల బాణసంచాపై తాము పూర్తి నిషేధం విధించలేదని క్లారిటీ ఇచ్చింది. బేరియం సాల్ట్ ఉపయోగించిన క్రాకర్స్‌పై మాత్రమే నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది. పర్యావరణానికి హానికరమైన బాణాసంచా కాల్చడానికి వీల్లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రాష్ట్రాలు, ఏజెన్సీలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ ఆదేశాలను తూ.చ తప్పకుండా పాటించాలని, అతిక్రమిస్తే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

Read Also: Pakistan: చివరకు పాస్‌పోర్ట్‌లు ప్రింట్ చేసుకోలేని దుస్థితిలో పాకిస్తాన్..
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!