NTV Telugu Site icon

Hyderabad Police: దీపావళి రోజు ఆ సమయంలోనే క్రాకర్స్ పేల్చాలి.. హైదరాబాద్ పోలీస్ ఆదేశాలు

Divali

Divali

దీపావళి సందర్భంగా పటాకులు పేల్చడంపై హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రజలకు మార్గదర్శకాలు జారీ చేశారు. పర్యావరణ అనుకూలమైన, సురక్షితమైన దీపావళిని జరుపుకోవడానికి ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని.. చట్ట అమలుకు సహకరించాలని కోరారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో దీపావళి రోజు రాత్రి 8 నుండి 10 గంటల వరకు క్రాకర్లు పేల్చాలని నోటీసుల్లో తెలిపారు. అంతేకాకుండా.. రోడ్లు, పబ్లిక్ ప్రాంతాలలో రాత్రి 8 నుంచి 10 మధ్య తప్పితే మిగతా సమయాల్లో పరిమితికి మించి శబ్ధం వచ్చే టపాసులు కాల్చొద్దని చెప్పారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలెవరూ మామూలు టపాసులు కాల్చొద్దని కోరారు. దీని వల్ల వాయు, శబ్ద కాలుష్యం పెరుగుతుందని తెలిపారు. బదులుగా గ్రీన్ కాకర్స్ తోనే పండుగ చేసుకోవాలని సూచించారు. ఈనెల 12 నుంచి 15 వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపారు. పై ఆదేశాలను ఉల్లంఘించిన ఎవరైనా హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టం, 1348 ఫాస్లీ (నం. IX) అమలులో ఉన్న ఇతర సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.

Read Also: D.K.Shivakumar: ఎప్పుడూ మమ్మల్ని తలుచుకోనిదే కేసీఆర్ నిద్రపోడు

ఇదిలా ఉంటే.. దీపావళి రోజు ఫైర్‌క్రాకర్స్ విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. దేశంలో అన్ని రకాల బాణసంచాపై తాము పూర్తి నిషేధం విధించలేదని క్లారిటీ ఇచ్చింది. బేరియం సాల్ట్ ఉపయోగించిన క్రాకర్స్‌పై మాత్రమే నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది. పర్యావరణానికి హానికరమైన బాణాసంచా కాల్చడానికి వీల్లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రాష్ట్రాలు, ఏజెన్సీలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ ఆదేశాలను తూ.చ తప్పకుండా పాటించాలని, అతిక్రమిస్తే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

Read Also: Pakistan: చివరకు పాస్‌పోర్ట్‌లు ప్రింట్ చేసుకోలేని దుస్థితిలో పాకిస్తాన్..