NTV Telugu Site icon

Crime News: ముషీరాబాద్‌ ఫైనాన్సర్ హత్య.. వైజాగ్‌లో నిందితుడు అరెస్ట్

Crime

Crime

Crime News: హైదరాబాద్ ముషీరాబాద్ బోయిగూడ ప్రాంతంలో చోటుచేసుకున్న ఫైనాన్సర్ దారుణ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతిని సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన నవీన్‌ను వైజాగ్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఫైనాన్సర్ సట్నం సింగ్‌ను నవీన్ ఈ నెల 4వ తేదీన కత్తితో దాడి చేసి హత్య చేశాడు. హత్య అనంతరం సంప్‌లో మృతదేహాన్ని సంపూలో పడేసి నేరం నుంచి తప్పించుకునేందుకు వైజాగ్‌కు పారిపోయినట్టు పోలీసులు వెల్లడించారు.

Read Also: Noise Air Buds Pro 6: 24-బిట్ హై-క్వాలిటీ ఆడియో ఫీచర్ తో నాయిస్ ఎయిర్ బడ్స్ ప్రో 6 లాంచ్

సట్నం సింగ్ మృతదేహంపై పలు కత్తిపోట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. హత్య అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసేందుకు కూడా నవీన్ ప్రయత్నించినట్టు విచారణలో వెల్లడైంది. పోలీసుల అనుమానాల ప్రకారం, సట్నం సింగ్ వద్ద అప్పుగా తీసుకున్న డబ్బుల విషయంలోనే ఇద్దరి మధ్య తీవ్ర వివాదం జరిగిందని, అదే కారణంగా ఈ దారుణ హత్య చోటు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం సట్నం సింగ్ కనిపించకుండా పోవడంతో, అతని కుటుంబ సభ్యులు అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటికే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అల్వాల్ పోలీసులు కేసును ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. డబ్బులు వసూలు చేసేందుకు ముషీరాబాద్‌లోని బోయిగూడ వెళ్లిన సట్నం సింగ్ అక్కడే కనిపించకుండా పోవడం ఈ ఘటనకు కారణమైంది. ప్రస్తుతం నవీన్‌ను అరెస్టు చేసిన పోలీసులు మరింత విచారణ చేపడుతున్నారు.