Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్లోని అమీర్పేట్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మైత్రివనం ఎదురుగా ఉన్న కేఎస్ఆర్ ఫ్యాషన్స్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. భవనం నుంచి ఎగిసిపడిన అగ్నికీలలు వేగంగా వ్యాపించడంతో సమీపంలోని దుకాణాలకు సైతం మంటలు అంటుకున్నాయి. మంటలు క్రమంగా విస్తరిస్తుండటంతో స్థానిక వ్యాపారులు, ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఈ అంశంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు సైతం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో కొంతసేపు రద్దీ నెలకొనగా, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టారు. ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా లేదా అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ప్రస్తుతం తెలియరాలేదు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన అనంతరం అగ్నిప్రమాదానికి కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టనున్నారు.
Also Read
- Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
తాజావార్తలు
-
Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్ప్లే, 13MP కెమెరా!
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!