Hyderabad: హైదరాబాద్‌లో కలుషిత ‘అల్లం-వెల్లుల్లి’ పేస్ట్ గుట్టురట్టు.. రూ. 22 లక్షల సామగ్రి సీజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్ నగరంలో కలుషిత ఆహార పదార్థాల తయారీపై పోలీసులు మరోసారి కఠిన చర్యలు తీసుకున్నారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్టెదాన్ పారిశ్రామిక ప్రాంతంలో నాసిరకం అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి విక్రయిస్తున్న కేంద్రంపై కమిషనర్ టాస్క్‌ఫోర్స్ (ఖైరతాబాద్ జోన్), హెచ్-ఫాస్ట్ బృందం సంయుక్తంగా ఆకస్మిక దాడి నిర్వహించింది. పక్కా సమాచారంతో పోలీసులు కట్టెదాన్ ఐడీఏలోని ‘SKR ఫుడ్ ప్రొడక్ట్స్’ (ప్లాట్ నెం.25, SEIE) పై దాడి చేశారు. ఈ సందర్భంగా హసన్ అలీ రూపానీ (55) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అబిడ్స్ ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. తనిఖీల్లో ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రంలో తీవ్ర అపరిశుభ్ర పరిస్థితులు వెలుగుచూశాయి. ప్లాస్టిక్ డబ్బాల్లో, పరిశుభ్రతకు విరుద్ధంగా పేస్ట్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నాణ్యత లేని అల్లం, వెల్లుల్లి తొక్కలను ఉపయోగించి పేస్ట్ తయారు చేస్తున్నట్లు వెల్లడైంది.
READ MORE: UP: దోమల కోసం అగరబత్తులు వెలిగింపు.. 4 సిలిండర్లు పేలి.. సోదరులకు తీవ్రగాయాలు
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
పేస్ట్ తయారీలో ఎసిటిక్ యాసిడ్, గ్జాంతమ్ గమ్ పౌడర్ వంటి రసాయనాలు కలుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. తయారు చేసిన పేస్ట్‌ను బహిరంగ ప్రదేశాల్లో నిల్వ చేయడంతో దుమ్ము, ఈగలు వాలినట్లు పోలీసులు తెలిపారు. ఈ పేస్ట్‌ను హోల్‌సేల్ కిరాణా దుకాణాలు, క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో నిందితుడు చెలగాటం ఆడుతున్నాడని పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేట్ లేకుండానే లాభాపేక్షతో ఈ అక్రమ వ్యాపారం సాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దాడిలో సుమారు రూ.22 లక్షల విలువైన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 4,032 కిలోల అల్లం-వెల్లుల్లి పేస్ట్, 6,000 కిలోల నాసిరకం వెల్లుల్లి, 210 కిలోల నాసిరకం అల్లం, వెల్లుల్లి పొట్టు సంచులు, 250 కిలోల ఉప్పు, ఎసిటిక్ యాసిడ్, గ్జాంతమ్ గమ్ పౌడర్, 5 గ్రైండింగ్ యంత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన నిందితుడిని, స్వాధీనం చేసిన సామగ్రిని తదుపరి విచారణ కోసం మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకు అప్పగించారు.
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!