UP: దోమల కోసం అగరబత్తులు వెలిగింపు.. 4 సిలిండర్లు పేలి.. సోదరులకు తీవ్రగాయాలు
- అలీగఢ్‌లో ఘోర అగ్నిప్రమాదం
- దోమల కోసం అగరబత్తులు వెలిగింపు
- 4 సిలిండర్లు పేలి.. సోదరులకు తీవ్రగాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫిర్దౌస్ నగర్‌లో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో ఇద్దరు సోదరులు తీవ్రగాయాలు పాలయ్యారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
అలీగఢ్‌లోని ఖర్సీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిర్దౌస్ నగర్‌లో మంగళవారం రాత్రి 2:30 గంటలకు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దోమల నివారణ కోసం అగరబత్తి లేదా గ్యాస్ లీక్ కారణంగా ఈ ఘటన జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. షంషాద్ మార్కెట్‌లో షాజాద్, జర్రా అనే ఇద్దరు సోదరులు టీ స్టాల్ నడుపుతున్నారు. అయితే ఇంటిపై అంతస్తులో నాలుగు నుంచి ఐదు గ్యాస్ సిలిండర్లను నిల్వ ఉంచారు.
Also Read
- PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
- Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్‌డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
అయితే దుకాణం మూసేశాక ఇంటికొచ్చాక మండే వస్తువు తగలగానే ఒక్కసారిగా సిలిండర్లు ఒకదాని తర్వాత ఒకటి పేలిపోయాయి. ఈ పేలుడులో ఇద్దరు సోదరులు తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాకుండా ఇంటి పైభాగం కూడా కాలి బూడిదైపోయింది. ఇక పేలుళ్ల శబ్దం విన్న స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. పేలుళ్ల శబ్దానికి స్థానికులు భయంతో ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు.
ఇది కూడా చదవండి: Inter Result: అంతులేని విషాదం.. ఇంటర్ ఫలితాలు విడుదల.. ప్రాణాలతో లేని ‘టాపర్’
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సిలిండర్లు పేలడంతో మంటల తీవ్రతకు భవనం మొత్తం కంపించిందని తెలిపారు. ఇక సంఘటనా స్థలంలో నాలుగు పగిలిన సిలిండర్లు లభించాయని చీఫ్ ఫైర్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ తెలిపారు. గదిలోకి గ్యాస్ లీక్ అవుతోందని.. అగ్గిపుల్ల లేదా ఎలక్ట్రికల్ స్విచ్ కారణంగా ఈ పేలుడు సంభవించి ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో గ్యాస్ సిలిండర్లను ఇంటి లోపల ఎందుకు నిల్వ ఉంచారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: IPS Couple Wedding: అప్పగింతల సమయంలో వెక్కి వెక్కి ఏడ్చిన ఐపీఎస్ పెళ్లికూతురు అన్షికా వర్మ
తాజావార్తలు
-
Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
-
Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
-
Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
-
Ak 47 : ‘ఆదర్శ కుటుంబం’ చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
-
Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు ‘+91’ ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!