ACB Raids: హైదరాబాదులో ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. విద్యుత్ శాఖలో ఏడీఈగా పని చేస్తున్న అంబేడ్కర్ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచే ఏక కాలంలో సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌తో పాటు మరో మరి కొన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. కొండాపూర్‌లోని మ్యాగ్నా లేక్ వ్యూ అపార్ట్‌మెంట్‌లో అంబేడ్కర్ నివాసం ఉంటున్నారు. నాననక్‌రాంగూడలోని ఆంట్యార్ అబ్డే అపార్ట్‌మెంట్ లోని అంబేడ్కర్ పర్సనల్ కార్యాలయం ఉంది. అక్కడ కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అంబేడ్కర్‌పై ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న అభియోగాలు ఉన్నాయి. ఇప్పటికే అంబేడ్కర్ కు బినామీలు ఉన్నట్లు గుర్తించారు. బినామీల వివరాలను ఏసీబీ ఆరా తీస్తోంది. ప్రస్తుతం అంబేడ్కర్‌ను విచారిస్తున్నారు.
అంబేడ్కర్ భారీగా ఆస్తులు కూడా పెట్టినట్లు గుర్తించారు.
READ MORE: Tirupati Murder Mystery: తిరుపతి అటవీ ప్రాంతంలో నాలుగు మృతదేహాల మిస్టరీలో మరో ట్విస్ట్
