NTV Telugu Site icon

HYDRA : ప్లాట్‌ కొంటున్నారా.. హైడ్రా సూచనలు తెలుసుకోండి

Hydra

Hydra

HYDRA : ఫార్మ్ ప్లాట్లు పేరిట అనుమ‌తి లేని లే ఔట్లలో ప్లాట్లు కొనొద్దని ప్రజలకు హైడ్రా సూచన చేసింది. అనుమ‌తి లేని లే ఔట్లలో ప్లాట్లు కొని ఇబ్బందులు ప‌డొద్ద‌న్న హైడ్రా పేర్కొంది. న‌గ‌ర శివార్ల‌లో ఫార్మ్ ప్లాట్ల పేరిట అమ్మ‌కాలు జ‌రుగుతున్నాయ‌ని.. వీటిని కొన్న వారు త‌ర్వాత ఇబ్బందులు ప‌డాల్సి ఉంటుంద‌ని హైడ్రా హెచ్చ‌రించింది. ఫార్మ్ ప్లాట్ల రిజిస్ట్రేష‌న్ల‌పై నిషేదం ఉన్న‌ప్ప‌టికీ.. కొన్ని ప్రాంతాల్లో అమ్మ‌కాలు జ‌రుగుతున్నాయ‌ని హైడ్రాకు ఫిర్యాదులు అందాయని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర‌న‌గ‌ర్ మండ‌లం, ల‌క్ష్మిగూడ విలేజ్ స‌ర్వే నంబ‌రు 50లోని 1.02 ఎక‌రాల్లో ఫార్మ్ ప్లాట్ల పేరిట లే ఔట్ వేసి అమ్మేస్తున్నార‌ని హైడ్రా కు ఫిర్యాదు అందిందని ఆయన తెలిపారు. తెలంగాణ మున్సిప‌ల్ యాక్ట్ 2019, తెలంగాణ పంచాయ‌త్ రాజ్ యాక్ట్ 2018లో పొందు ప‌రిచిన విధంగా ఎక్క‌డా ఫార్మ్ ప్లాట్లు అమ్మ‌డానికి వీలు లేదని హైడ్రా కమిషనర్‌ తెలిపారు. ఫార్మ్ ల్యాండ్ అంటే 2 వేల చ‌ద‌ర‌పు మీట‌ర్లు, లేదా 20 గుంట‌ల స్థలం ఉండాల‌ని కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ పేర్కొన్నారు. ఫార్మ్ ప్లాట్లు రిజిస్ట్రేష‌న్లు చేయ‌రాద‌ని స్టాంపులు, రిజిస్ట్రేష‌న్ల శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.

Delhi : ఐదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారడం ఖాయం : ఆమ్ ఆద్మీ పార్టీ