ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ లో దీపావళి సేల్ లో బంపరాఫర్లు ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ఇయర్‌ఫోన్‌లు, స్పీకర్లు, స్మార్ట్‌వాచ్‌లపై డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. బ్రాండెడ్ ల్యాప్ టాప్ లపై క్రేజీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. HP, Dell, Acer, Asus వంటి ల్యాప్‌టాప్‌లపై తగ్గింపు ప్రకటించింది. Asus Vivobook S16 OLED (S3607CA) ల్యాప్‌టాప్‌ను రూ. 87,990 కు కొనుగోలు చేయవచ్చు. ఇది 1920×1200 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 16-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. దీనికి టచ్‌స్క్రీన్ సపోర్ట్ లేదు. కోర్ i7 ప్రాసెసర్‌తో ఆధారితమైన ఇది 16GB RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందిస్తుంది.
Also Read:Melioidosis Disease: పల్నాడులో మెలియాయిడోసిస్ వ్యాధి కలకలం..
HP 15-FD1254TU ల్యాప్‌టాప్ అమెజాన్ ఇండియాలో రూ. 62,490 కు లభిస్తుంది. ఇది 15.60-అంగుళాల డిస్ప్లే, విండోస్ OS, 16GB RAM, 512GB SSD స్టోరేజ్, ఇంటెల్ కోర్ అల్ట్రా 5 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఏసర్ ఆస్పైర్ లైట్ ల్యాప్‌టాప్ సేల్ లో రూ. 58,990 ధరకు లభిస్తుంది. ఇది 1920 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 15.6-అంగుళాల డిస్ప్లేని కలిగి ఉంది. ఇది 16GB LPDDR5 SDRAM, 1TB స్టోరేజ్ కు మద్దతు ఇస్తుంది.
