Brazil Model : చాలామందికి ఈ మధ్య పెళ్లి కావడమే కష్టంగా ఉంది. పెళ్లికి ఒక్క పిల్లను వెతుక్కోడానికే పుణ్యకాలం సరిపోతుంది. 30లు 40లు దాటినా పెళ్లికాకుండా బ్యాచులర్స్ గా మిగిలిపోతున్నారు. కొంతమంది అదృష్టమేమో కానీ, ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో పెళ్లిళ్లు చేసుకున్నారన్న వార్తలు విని ‘వాడికి ఎక్కడో సుడి ఉందిరా ’ అంటూ బ్యాచులర్లు ఆడిపోసుకుంటున్నారు. అలాంటి వార్తే ఇంకొకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్రెజిల్‌కు చెందిన ఓ మేల్ మోడల్ ఆరుగురి భార్యలతో ఆదర్శ భర్త అనిపించుకుంటున్నాడు. అంతే కాదు వారికోసం ఓ స్పెషల్ బెడ్ కూడా తయారు చేయించాడు.
Read Also:Poonch Terror Attack: పూంచ్ దాడిలో సంచలన విషయం.. ఉగ్రవాదులకు స్థానికుల సాయం..
సాధారణంగా దంపతులు ఒక డబుల్ కాట్ బెడ్ ఉంటే సరిపోతుంది. మరి ఇద్దరు, ముగ్గురు భార్యలు ఉన్న భర్తల పరిస్థితి ? వారికి డబుల్ కాట్ కాదు కదా.. కింగ్ సైజ్ బెడ్‌లు రెండున్నా సరిపోవు. అలాంటిది బ్రెజిల్‌కు చెందిన ఆర్థర్ ఓ ఉర్సోకు ఏకంగా ఆరుగురు భార్యలు.. వారిలో ఎవరితో కలిసి నిద్రపోయినా.. మిగతా భార్యలు అలుగుతారు. అందుకే, ఆ ఆదర్శ భర్తకు ఓ సూపర్ ఐడియా వచ్చింది. మొత్తం ఏడుగురు (భర్తతో కలిపి) కలిసి హాయిగా నిద్రపోయేందుకు 20 అడుగుల బెడ్ తయారు చేయించాడు. ఇంకేం వారితో కలిసి హాయిగా నిద్రపోతున్నాడు. తను హాయిగా నిద్రపోతున్నాడు కానీ, తను చేయించిన బెడ్ ధర వింటే మనకు నిద్రపట్టదు. ఆ బెడ్‌ను ఏకంగా రూ.81 లక్షలతో చేయించుకున్నాడు. మీకు ఒక్క సారిగా ఏమనిపిస్తోంది. ఈ డబ్బుతో మంచి అపార్టుమెంటు కొనుకోవచ్చు అనుకుంటున్నారా. అంతా తలోదిక్కు నిద్రపోడానికి బదులు.. ఒకే చోట నిద్రపోతే బాగుంటుందని..ఈ 20 అడుగులతో బెడ్ తయారు చేయించాడు.
Read Also:Gold Smuggling: రూ.2వేల కోసం రెండు కిలోల బంగారం స్మగ్లింగ్.. సరిహద్దులో పట్టుబడిన మహిళ
ఈ మంచం తయారు చేసేందుకు ఆర్థర్ 80 వేల పౌండ్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.81.54 లక్షలు) ఖర్చు చేశాడు. 20 అడుగుల వెడల్పు, 7 అడుగుల పొడవు గల మంచం తయారీకి సుమారు 15 నెలల సమయం పట్టిందని తెలిపాడు. ఈ మంచం తయారీకి మొత్తం 12 మంది సిబ్బంది పనిచేశారట. మొత్తం 950 స్క్రూలతో ఈ మంచాన్ని బిగించారట. ఆర్థర్ తాజాగా తన ఘనకార్యాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. తన 20 అడుగుల మంచం ఫొటోలను పోస్ట్ చేశాడు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మంచంగా ఆర్ధర్ పేర్కొన్నాడు.
Read Also: Woman Suicide: బ్యూటీపార్లర్‌కు వెళ్లనివ్వడం లేదని భార్య ఆత్మహత్య
ఇక ఆర్థర్ పెళ్లిళ్ల విషయానికి వస్తే.. మూడేళ్లల్లో పది పెళ్లిల్లు చేసుకున్నాడు. 2021లో ఫస్ట్ పెళ్లి అయింది. మొదటి భార్యపేరు లువానా. ఆ తర్వాత ఆమె అనుమతి తీసుకుని మరో తొమ్మిది మందిని చేసుకున్నాడు. గతేడాది అతడికి నలుగురు భార్యలు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత 51 ఏళ్ల ఒలిండా మారియాను పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం లువానా కజాకి (27), ఎమెల్లీ సౌజా (21), వల్క్విరియా శాంటోస్(24), ఒలిండా మారియా(51), డామియానా(23), అమండా అల్బుకెర్కీ(28)లతో సంసారం చేస్తున్నాడు.
