నిండు నూరేళ్లు కలిసి జీవించాల్సిన భార్యాభర్తలు క్షణికావేశాలతో దారుణాలకు ఒడిగడుతున్నారు. అనుమానం పెనుభూతమై భార్యలను అంతమొందిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కడపలో చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తె ఆమె పాలిట కాలయముడిగా మారారు. అనుమానం పెనుభూతంగా మారి ఆ పచ్చని కుటుంబంలో చిచ్చు లేపింది. చెన్నూరు మండలం కొత్త గాంధీ నగర్ లో భార్యపై అనుమానంతో, భర్త ఆమెను హత్య చేసి ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి.
Also Read:Astrology: జూన్ 1, ఆదివారం దినఫలాలు
కువైట్ నుంచి 11 రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చిన నిత్యానంద్ తన భార్య లక్ష్మీ కుమారి పై అనుమానం పెంచుకున్నాడు. ఈ కారణంతో ఇరువురి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవని బంధువుల ఆరోపిస్తున్నారు. ఆ అనుమానంతోనే ఆదివారం తెల్లవారుజామున లక్ష్మీ కుమారిని నిత్యానంద్ గొంతకు తాడుతో బిగించి చంపాడు. ఆ తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇరువురిమృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం కోసం కడప రిమ్స్ కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
