NTV Telugu Site icon

Shocking: ఆహారంలో వెంట్రుక వచ్చిందని భార్యకు గుండు కొట్టించాడు..

Getting Hair In Food

Getting Hair In Food

Shocking News: భోజనంలో తల వెంట్రుక వచ్చిందని ఓ భర్త కట్టుకున్న భార్యకే గుండు కొట్టించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో చోటుచేసుకుంది. భోజనం చేస్తుండగా.. ఆహారంలో తల వెంట్రుక వచ్చిందని భార్యతో గొడవకు దిగాడు. భోజనం చేస్తుండగాఆహారంలో తల వెంట్రుకలు వచ్చాయని కోపోద్రిక్తుడైన భర్త, అత్తమామలు ఆ మహిళకు గుండు కొట్టించారు. దీంతో ఆ వివాహిత తన భర్తతో సహా ముగ్గురిపై వరకట్న చట్టంలో పలు సెక్షన్ల కింద కేసు పెట్టింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్‌ చేశారు.

ఆ మహిళ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని పిలిభిత్ జిల్లా మిలాక్ గ్రామానికి చెందిన జహీరుద్దీన్‌కు, సీమాదేవికి 7 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. పెళ్లయినప్పటి నుంచి రూ.15 లక్షలు కట్నం ఇవ్వాలని అత్తింటివారు తనను వేధిస్తున్నారని సీమాదేవి తెలిపింది. కాగా, శుక్రవారం రాత్రి ఇంట్లో మహిళ వంట చేసింది. తర్వాత ఆమె తన భర్తకు ఒక ప్లేట్‌లో భోజనం వడ్డించింది.

Asaduddin Owaisi: నలుగురు భార్యలు ముస్లింలకు చట్టబద్ధమే

భోజనం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ప్లేట్‌లో వెంట్రుకలు రావడంతో భర్త జహీరుద్దీన్‌కు కోపం వచ్చింది. ఈ నేపథ్యంలో తన భార్యకు గుండు కొట్టించాడు. అన్నదమ్ములు జమీరుద్దీన్ బరాసత్, జులేఖా ఖాతూన్‌లతో కలిసి భర్త వివాహితను కొట్టారు. అంతే కాదు తన చేతులు, కాళ్లు కట్టేసి నోటిలో గుడ్డను బిగించి.. ఆ తర్వాత శృంగారానికి ప్రయత్నించాడని.. ఇచ్చాడని మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. భర్త క్రూరత్వానికి పాల్పడుతున్నాడని, తన భర్తను రెచ్చగొట్టి బావమరిది, అత్తమామలు సహకరిస్తున్నారని మహిళ తెలిపింది. ఘటన అనంతరం వివాహిత ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివాహిత నుంచి అందిన ఫిర్యాదు ఆధారంగా.. నిందితులపై వరకట్న చట్టంతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళ భర్తను అరెస్టు చేసి జైలుకు పంపినట్లు పోలీసు అధికారి సతీష్ శుక్లా చెప్పారు.

Show comments