హైదరాబాద్‌లోని మేడిపల్లి ప్రాంతంలో గర్భంతో ఉన్న తన భార్యను కిరాతకంగా హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ప్రేమ వివాహమే అయినప్పటికీ భార్యపై అనుమానం పెంచుకున్న భర్త మహేందర్ రెడ్డి, ఆమెను దారుణంగా హతమార్చి శరీరాన్ని ముక్కలుగా చేసి మూసి నదిలోపడేశాడు. ఈ ఘటన మరువక ముందే మరో ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. భార్య ను హత్య చేసి అడవుల్లో తగుల బెట్టాడు ఓ భర్త. వీరిద్దరు 2014లో ప్రేమ వివాహం చేసుకున్నట్లు సమాచారం. అయినప్పటికీ భార్యపై ఏమాత్రం ప్రేమేలేదు. అసలు ఏం జరిగిందంటే?
శ్రీశైలం, శ్రావణి ఇద్దరు భార్యభర్తలు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్నారు దంపతులు. కొంతకాలం బాగానే సాగిన వీరి కాపురంలో అనుమానం పెనుభూతంగా మారింది. శ్రావణి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని అనుమానించాడు భర్త శ్రీశైలం. ఈ క్రమంలో భార్యను అంతమొందించాలని ప్లాన్ చేశాడు. దీనిలో భాగంగా భార్య శ్రావణి తో సోమశిలకు వెళ్దామని చెప్పాడు.. మార్గమధ్యలో అడవిలోకి తీసుకెళ్లి కత్తితో పొడిచి హత్య చేశాడు భర్త శ్రీశైలం.
Also Read:TPCC Mahesh Goud : బండి సంజయ్ గెలుపు దొంగ ఓట్లతో సాధ్యమైంది
తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించాడు. పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ శివారు ఫారెస్ట్ లో హత్య చేసి తగుల బెట్టాడు. తమ కూతురు కనిపించకపోవడంతో మృతురాలి తండ్రి మహబూబ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కాగా భార్యను హత్య చేసిన అనంతరం పెద్దకొత్తపల్లి పీఎస్ లో లొంగిపోయాడు భర్త శ్రీశైలం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
