NTV Telugu Site icon

Husband kills wife : భార్యను ముక్కలు, ముక్కలుగా నరికి.. సూట్‌కేస్‌లో దాచిపెట్టిన భర్త.. తర్వాత…

Bengaluru

Bengaluru

బెంగళూరులో మరో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. హులిమావు ప్రాంతంలో ఒక వ్యక్తి తన భార్యను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి సూట్‌కేస్‌లో దాచి పెట్టిన ఘటన చోటు చేసుకుంది. నిందితుడిని మహారాష్ట్ర నివాసి రాకేష్‌గా, మృతురాలిని 32 ఏళ్ల గౌరీ అనిల్ సాంబేకర్‌గా గుర్తించారు. హత్య తర్వాత, రాకేష్ స్వయంగా తన భార్య తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఈ భయంకరమైన నేరం గురించి తెలియజేశాడు.

READ MORE: Off The Record : కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా.. అక్కడ కార్యకర్తలను నడిపించే దిక్కే లేదా?

డీసీపీ కథనం ప్రకారం.. రాకేష్‌, గౌరీ అనిల్ సాంబేకర్‌(32) ఇద్దరు భార్యాభర్తలు. ఇద్దరూ మహారాష్ట్రకు చెందినవారు. రాకేష్ ఓ ప్రైవేట్ కంపెనీలో వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. గత ఒక సంవత్సరం నుంచి దొడ్డకన్నహళ్లిలో నివసిస్తున్నారు. గౌరి మాస్ కమ్యూనికేషన్‌లో పట్టభద్రురాలైంది. ప్రస్తుతం ఎలాంటి ఉద్యోగం చేయడం లేదు. ఇంటి యజమాని, పొరుగువారి ప్రకారం.. ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరిగేవి. గౌరి చాలాసార్లు రాకేష్ పై చేయి చేసుకుంది. ఈ తగాదాలతో విసిగిపోయాడు రాకేష్. నిన్న కూడా ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. తీవ్ర వాగ్వాదం చెలరేగడంతో రాకేష్ గౌరి కడుపులో కత్తితో పొడిచాడు.

READ MORE: Off The Record : కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా.. అక్కడ కార్యకర్తలను నడిపించే దిక్కే లేదా?

ఆ తర్వాత ఆమె గొంతు కోసి హత్య చేశారు. మృతదేహాన్ని ఏం చేయాలతో పాలుపోక ఒక పెద్ద ట్రావెల్ సూట్‌కేస్‌లో దాచి పెట్టి బాత్రూంలో ఉంచాడు. జరిగిన విషయాన్ని గౌరి తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయాన్ని ఇంటి యజమాని సాయంత్రం 5:30 గంటలకు సౌత్-ఈస్ట్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు తెలియజేశాడు. సమాచారం అందుకున్న హులిమావు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) సారా ఫాతిమా దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.