NTV Telugu Site icon

Kurnool: కర్నూలులో భార్య, అత్తను హతమార్చిన భర్త

Murder

Murder

కర్నూల్ జిల్లాలోని కౌతాళం మండలం బాపురంలో దారుణం జరిగింది. భార్య మహాలక్ష్మి, అత్త హనుమంతమ్మను భర్త రమేష్ హతమర్చాడు. రెండు నెలల క్రితమే కర్నాటకకు చెందిన రమేష్ కు బాపురం గ్రామానికి చెందిన మహాలక్ష్మి అనే యువతికి మధ్య పెళ్లి జరిగింది. అయితే భార్య మహాలక్ష్మిపై భర్త అనుమానం పెంచుకున్నాడు. శనివారం రోజు అర్ధరాత్రి అత్తింటికి వచ్చిన నిందితుడు రమేష్ నిద్రిస్తున్న.. మహాలక్ష్మి, ఆమె తల్లి హనుమంతమ్మను అత్యంత దారుణంగా హత్య చేశాడు.

Read Also: Afghanistan Women: దెబ్బతిన్న హస్తకళల మార్కెట్.. ఆఫ్ఘనిస్తాన్‎లో మహిళల ఆందోళన

అయితే నిందితుడు రమేష్ ది కర్ణాటక రాష్ట్రంలోని టెక్కలికోటకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాలంటీర్ గా మహాలక్ష్మి పనిచేస్తుండగా.. వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న రమేష్.. రెండు నెలల క్రితమే మహాలక్ష్మిని పెళ్లి చేసుకున్నట్లు పోలీసుల విచారణ తేలింది. గతంలో పెళ్లయి భార్య, భర్తలను రమేష్, మహాలక్ష్మి వదిలేశారని తెలిపారు.

Read Also: School Bus: నేలకొండపల్లిలో స్కూల్ బస్సు దగ్ధం

బాపురంలో భార్య, అత్తను అనుమానంతో భర్త రమేష్ నరికి చంపినట్లు తెలుస్తుంది. రెండు రోజుల క్రితం జరిగిన జంట హత్యలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులు నిందితుడు రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వివాహేతర సంబంధాలు, అనుమానం కారణంగా హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. అటు తెలంగాణ రాష్ట్రంలో కూడా వరుసగా హత్యలు చేయడం ప్రస్తుతం కలకలం రేపుతుంది. ఇలాంటి ఘటనలు నిత్యం ఏదో ఒక చోటు జరుగుతుండటం పోలీసులకు సవాల్ గా మారింది.

Show comments