Site icon NTV Telugu

Uttar Pradesh: భార్య చేసిన కూర నచ్చలేదని చంపేసిన భర్త

Kiorsin

Kiorsin

కూర నచ్చలేదని భార్యను సజీవ దహనం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బండాలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఆదివారం రోజు భార్యపై గొడవకు దిగాడు. అంతేకాకుండా దారుణంగా చితకబాదిన భర్త.. అనంతరం భార్యపై కిరోసిన్ పోసి సజీవ దహనం చేశాడు. స్థానికులు ఈ ఘటనను చూస్తూ ఉన్నప్పటికీ.. ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు జోగ్మయ బండా నగర్ కొత్వాలి పరిధిలోని ఖోట్ల మొహల్లాలో నివాసముంటుంది. భర్త ముఖేష్ ఆమెను తరచూ కొట్టేవాడని మృతురాలి బంధువులు తెలుపుతున్నారు. జోగ్మయను ఆమె భర్త చాలా హింసించేవాడని.. ఆదివారం మద్యం తాగి ఇంటికి వచ్చి దారుణంగా కొట్టాడని బంధువులు తెలిపారు. ఈ ఘటనపై బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Read Also: Hansika Motwani : పొట్టి నిక్కరులో థైస్ షోతో మతి పోగొడుతున్న యాపిల్ బ్యూటీ..

మరోవైపు తన భర్త రోజు తనను చిత్రహింసలకు గురిచేసేవాడని.. ఇదే విషయమై పలుమార్లు పోలీసులకు కూడా చెప్పింది. మృతురాలు తన బంధువులతో కూడా.. తన భర్త వేధిస్తున్నాడని చెప్పేది. వారు భర్త ముఖేష్ కు పలుమార్లు ఫోన్ చేసి మందలించినప్పటికీ అతనిలో మార్పు రాలేదు. అయితే ఆదివారం రోజున కూర సరిగా వండలేదని భార్యతో గొడవకు దిగాడు. మద్యం మత్తులో ఎలాపడితే అలా దారుణంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా.. భార్యపై కిరోసిన్‌ పోసి సజీవ దహనం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు సూపరింటెండెంట్ చెప్పారు.

Exit mobile version