Site icon NTV Telugu

Sangareddy: భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త.. అడ్డు వచ్చిన అత్తపై దాడి

Dead

Dead

సంసారాల్లో చిన్న చిన్న గొడవలు రావడం సర్వ సాధారణం. కానీ నేటి రోజుల్లో చిన్న గొడవలే దారుణాలకు దారితీస్తున్నాయి. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, భార్యా భర్తల మధ్య చోటుచేసుకుంటున్న మనస్పర్ధలు, ఒకరిపై ఒకరు పెత్తనం చెలాయించడం, పరాయి వ్యక్తులపై మోజు ఇలాంటి కారణాలు భార్యాభర్తల మధ్య చిచ్చుపెడుతున్నాయి. దీని కారణంగా చావడమో లేదా చంపడమో చేస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పటాన్ చెరు (మం) పెద్ద కంజర్ల గ్రామంలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ భర్త భార్యపై విచక్షణా రహితంగా దాడి చేసి అంతమొందించాడు. అడ్డు వచ్చిన అత్తపై కూడా దాడికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Also Read:Nidhi Agerwal : నెటిజన్ కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన నిధి అగర్వాల్..

ప్రమీల(26) రమేష్ (32) ఇద్దరు భార్యాభర్తలు. కొంతకాలం వరకు సాఫీగానే సాగిన వీరి కాపురంలో కలహాలు మొదలయ్యాయి. భార్యభర్తల మధ్య మనస్పర్థలతో గత కొంత కాలంగా భర్తకు దూరంగా వుంటుంది ప్రమీల. దీంతో ఆగ్రహానికి లోనైన భర్త రమేష్ భార్య ప్రమీలను రోకలిబండతో కొట్టి చంపాడు. అంతటితో ఆగకుండా అడ్డు వచ్చిన అత్త కవితపై దాడి చేశాడు. ఈ దాడిలో భార్య ప్రమీల అక్కడికక్కడే మృతిచెందింది.

Also Read:Kaushik Reddy: గ్రూప్-1 లో భారత దేశ చరిత్రలోనే పెద్ద స్కాం.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

అత్త కవితకు తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్నారు స్థానిక సీఐ వినాయక్ రెడ్డి, సిబ్బంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్ర గాయాలపాలైన అత్త కవితను సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. భార్య భర్త మధ్య మనస్పర్థల ఈ హత్య కు దారి తీసిందని సమాచారం. నిందితుడు రమేష్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version