భార్యాభర్తలిద్దరు ప్రభుత్వ టీచర్లుగా పనిచేస్తున్నారు. ఇద్దరు పిల్లలతో ఆనందంగా గడుపుతున్న ఆ కుటుంబంలో ఏం కష్టాలు దాపరించాయో ఏమో దారుణానికి ఒడిగట్టారు. టీచర్స్ గా పనిచేస్తున్న భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భార్య మృతి చెందగా.. భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన ఏలూరులో చోటు చేసుకుంది. గవర్నమెంట్ టీచర్లుగా పనిచేస్తున్న భార్యాభర్తలు ఆత్మహత్య యత్నించారు.
Also Read:Sleeping Prince: 20 ఏళ్లుగా కోమాలోనే.. సౌదీ ‘స్లీపింగ్ ప్రిన్స్’ అల్వలీద్ బిన్ ఖలీద్ మృతి
గవర్నమెంట్ టీచర్ గా పని చేస్తున్న చిన్నిదేవిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా.. ఆమె భర్త సురేంద్ర బ్లేడుతో ఒళ్లంతా కోసుకొని ఆత్మహత్య యత్నం చేసి తీవ్ర గాయాలపాలయ్యారు.. విషయం తెలుసుకున్న బంధువులు సురేంద్రను గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. దేవిక మృతిపై అనుమానాలు ఉన్నట్టుగా ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రూరల్ పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
