NTV Telugu Site icon

Bangladesh MP Murder Case: బంగ్లా ఎంపీ హత్య కేసులో కీలక మలుపు.. మానవ ఎముకలు స్వాధీనం..

Bangladesh Mp Murder Case

Bangladesh Mp Murder Case

Bangladesh MP Murder Case: గత నెలలో బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ హత్యకు గురైన విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వైద్యం కోసం కోల్‌కతా వచ్చిన ఆయనను దారుణంగా హత్య చేశారు. ఇప్పటికే ఆయన బాడీని రికవరీ చేయడం దర్యాప్తు అధికారులకు కష్టంగా మారింది. అంత పకడ్బందీగా ఈ హత్యకు పాల్పడ్డారు. మే 12న కోల్‌కతాకు వచ్చిన అన్వరుల్, ఆ తర్వాత నుంచి అదృశ్యమయ్యాడు. బెంగాల్ సీఐడీ ప్రకారం, జిహాద్ హవ్లాదార్, సియామ్ హుస్సేన్ అనే ఇద్దరు బంగ్లాదేశీ పౌరులు ఎంపీని హతమార్చినట్లు తెలుస్తోంది. ఈ హత్యకు ఎంపీ స్నేహితుడు రూ.5 కోట్ల సుపారీ ఇచ్చాడనే వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉంటే బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణా జిల్లాలోని కాలువలో మానవుడిదిగా భావిస్తున్న ఎముకనలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నార్త్ 24 పరగణాస్ జిల్లాలో ఇటీవళ అరెస్టైన 33 ఏళ్ల నిందితుడు సియామ్ హుస్సేన్‌ని విచారించిన తర్వాత ఈ రికవరీ సాధ్యమైంది. ఈ కేసులో తొలుత జిహాద్ హవ్లాదార్ అనే బంగ్లాదేశ్‌కి చెందిన నిందితుడి అరెస్ట్ జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకు రెండో వ్యక్తి హుస్సేన్‌ని అరెస్ట్ చేశారు.

Read Also: Modi’s swearing-in: ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబు హాజరుకానున్నారు

బంగ్లాదేశ్ ఎంపీ శరీరభాగాలను పారేసిన ఖచ్చితమైన స్థలాన్ని సియామ్ హుస్సేన్ సీఐడీకి వెల్లడించారు. ఈ సమాచారం ఆధారంగా సీఐడీ దక్షిణ 24 పరగణాస్‌లోని భాంగర్ ప్రాంతంలోని ఉత్తర కాశీపూర్‌లో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. మానవుడికి సంబంధించిన అనేక ఎములకును అధికారులు కనుగొన్నారు. వీటిని ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు.

కోల్‌కతాలోని న్యూ టౌన్ ప్రాంతంలో ఫ్లాట్ బంగ్లా ఎంపీ చివరిసారిగా కనిపించారు. ఈ ఫ్లాట్‌లోనే అతడిని హత్య చేసి, చర్మ ఒలిచి, ఎముకలను శరీర భాగాలను వేరు చేసి వేరు వేరు చోట్ల పారేశారు. అన్వరుల్ అజీమ్ అనార్‌కు పరిచయస్తుడైన గోపాల్ బిశ్వాస్ మే 18న స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఎంపీ మిస్సింగ్ గురించి తెలిపింది. మే 12న బిశ్వాస్ ఇంటికి వచ్చిన ఎంపీ, మే 13న మధ్యాహ్నం డాక్టర్ అపాయింట్‌మెంట్ కోసం వెళ్లి తిరిగి రాలేదు. హత్య చేసిన జిహాద్ హవ్లాదార్ కసాయి వృత్తిలో ఉన్నాడు. ఇతను బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడి ముంబైలో నివసిస్తున్నట్లు తేలింది.