Hum Mein Shahenshah Kaun: దాదాపు నలభై ఏళ్లుగా ఆగిపోయిన ఓ హిందీ సినిమా ఇప్పుడు వెండి తెరపైకి వచ్చేందుకు సిద్ధమైంది. ఆ సినిమానే ‘హమ్ మేన్ షాహెన్‌షా కౌన్’. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత అనేక మంది ప్రముఖులు నటించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని నిర్మాత రాజా రాయ్ నిర్మించారు. అప్పట్లో ఈ సినిమా తెరకెక్కిన సమయంలో హిందీ సినిమాను ఏలిన దిగ్గజ నటులంతా ఇందులో భాగమయ్యారు. సూపర్ స్టార్ రజనీకాంత్, డైలాగ్స్‌కు పేరుగాంచిన శత్రుఘన్ సిన్హా, అందం, అభినయానికి చిరునామాగా నిలిచిన హేమా మాలిని, అనితా రాజ్, ప్రేమ్ చోప్రా, శరత్ సక్సేనా, శరద్ సక్సేనా, అలాగే ఇప్పుడు మన మధ్య లేని గొప్ప నటులు అమ్రీష్ పూరీ, జగ్గదీప్ ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ నటులందరూ అప్పటి హిందీ సినిమా స్వర్ణయుగానికి ప్రతీకలుగా నిలిచారు.
READ MORE: 2nm GAA ప్రాసెస్+ ఆండ్రాయిడ్ 16తో Samsung Galaxy S26+ లాంచ్ అప్పుడే!
ఈ సినిమాకు దర్శకత్వం వహించింది దివంగత దర్శకుడు హర్మేష్ మల్హోత్రా. ఆయనతో పాటు ఈ సినిమాకు పని చేసిన సాంకేతిక బృందం కూడా అగ్రశ్రేణిదే. డైలాగ్స్‌ను సలీం-ఫైజ్ రాశారు. సంగీతాన్ని లెజెండరీ సంగీత దర్శకులు లక్ష్మీకాంత్–ప్యారేలాల్ అందించారు. పాటలకు అర్థవంతమైన పదాలు రాసింది ఆనంద్ బక్షి. నృత్య రూపకల్పన బాధ్యతను భారతీయ సినిమా డాన్స్‌కు కొత్త దారి చూపిన సరోజ్ ఖాన్ తీసుకున్నారు. ఈ చిత్రానికి అసోసియేట్ నిర్మాతలుగా అస్లాం మిర్జా, షబానా మిర్జా పనిచేశారు. రాజా రాయ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రాన్ని రెక్స్ మ్యూజిక్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పిస్తోంది. సినిమా విడుదలపై స్పందించిన నిర్మాత రాజా రాయ్ మాట్లాడుతూ.. “ఈ సినిమాపై మేం ఎప్పుడూ ఆశ వదులుకోలేదు. ఈ సినిమా నిర్మాణంలో చాలా బాధలను ఎదుర్కొన్నాం. ఈ రోజు ఇది ప్రేక్షకుల ముందుకు రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అన్ని పరిస్థితులను తట్టుకుని నిలబడిన ఈ సినిమా విడుదల కావడం ఒక విధమైన విధి నెరవేరినట్టుగా అనిపిస్తోంది” అని అన్నారు.
READ MORE: KTR: విచారణలో ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతాం.. కాంగ్రెస్ ను బొంద పెట్టేదాకా నిద్రపోం
సినిమాను ఇప్పుడు విడుదలకు సిద్ధం చేయడంలో టెక్నాలజీని చాలా జాగ్రత్తగా ఉపయోగించినట్టు అస్లాం మిర్జా తెలిపారు. పిక్చర్ మెరుగు పడటానికి, సౌండ్ క్లాలిటీ కోసం ఏఐ టెక్నాలజీని వాడినట్లు తెలిపారు. నటన, కథ, స్క్రీన్‌ప్లేలో ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేశారు. కొత్తగా మార్చడం కాదు, పాతదాన్ని కాపాడటమే లక్ష్యమని అన్నారు. ఈ నిర్ణయానికి షబానా మిర్జా కూడా పూర్తిగా మద్దతు ఇచ్చారు. ఈ సినిమా అప్పట్లోనే 35 ఎం.ఎం ఈస్ట్‌మన్ కలర్ ఫిల్మ్‌పై, ఈస్ట్‌మన్ కోడాక్ క్లాసిక్ ఫిల్మ్ స్టాక్‌తో చిత్రీకరించారు. అందుకే ఇందులో పాతకాలపు టెక్నీకలర్ తరహా గొప్ప విజువల్ అందాన్నిస్తాయి. కాగా.. 1989లో ఈ సినిమా షూట్ కంప్లీట్ అయినప్పటికీ.. అప్పట్లో సెన్సార్‌కు పంపకపోవడంతో ఇది విడుదల కాకుండా నిలిచిపోయింది. ఇందులోని నటన, విజువల్స్, కథ పరిమాణం అన్నీ ఆ కాలం సినిమా ఆలోచనల్ని స్పష్టంగా చూపిస్తాయి.
READ MORE: KTR: విచారణలో ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతాం.. కాంగ్రెస్ ను బొంద పెట్టేదాకా నిద్రపోం
ఈ సినిమా ఇంతకాలం ఆలస్యం కావడానికి కారణం కేవలం వృత్తిపరమైన సమస్యలు కాదు. వ్యక్తిగత విషాదాలే ఎక్కువగా ఉన్నాయి. సినిమా షూటింగ్ పూర్తయ్యాక నిర్మాత రాజా రాయ్ వ్యాపార పనుల కోసం లండన్‌కు వెళ్లారు. అక్కడ తన చిన్న కుమారుడిని కోల్పోయారు. ఆ విషాదం ఆయనను పూర్తిగా కుంగదీసింది. దాంతో సినిమా పని అక్కడితో ఆగిపోయింది. కొన్నేళ్ల తర్వాత మళ్లీ ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నించిన సమయంలోనే దర్శకుడు హర్మేష్ మల్హోత్రా మరణించడంతో మరో పెద్ద దెబ్బగా మారింది. ఇలా ఒకటి తర్వాత ఒకటి సమస్యలు వచ్చి ఈ సినిమా సంవత్సరాల పాటు నిలిచిపోయింది. ఇప్పుడు మాత్రం ఆధునిక సాంకేతికత సహాయంతో ఈ సినిమాకు కొత్త జీవం పోశారు. ఏఐ సహాయంతో రీస్టోరేషన్ చేసి, 4కే రీమాస్టరింగ్, 5.1 సరౌండ్ సౌండ్ చేశారు. అయినా సినిమా అసలు ఆత్మకు ఎక్కడా భంగం కలగకుండా జాగ్రత్త పడ్డారు. పాతకాలపు భావం అలాగే ఉంచి, నేటి థియేటర్లకు సరిపోయేలా మలిచారు. ఇప్పుడు ‘హమ్ మేన్ షాహెన్‌షా కౌన్’ అనే అధికారిక టైటిల్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇది ఓ పాతకాలపు కథ కాదు.. ఓ తరం జ్ఞాపకం.
