Site icon NTV Telugu

Telangana: మద్యం అమ్మకాల జోరు.. తెలంగాణ ఎక్సైజ్‌ శాఖకు భారీగా ఆదాయం

Wines Shop

Wines Shop

తెలంగాణలో మద్యం అమ్మకాల జోరుతో ఎక్సైజ్‌ శాఖకు భారీగా ఆదాయం సమకూరింది. గత సంవత్సరంతో పోలిస్తే ఏడు శాతం మద్యం అమ్మకాలు పెరిగినట్లుగా అధికారులు వెల్లడించారు. 2024-25లో ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ కు 34,600 కోట్లు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. కొత్త మద్యం దుకాణాల కోసం ధరఖాస్తుల రూపంలో ఆదాయం రూ. 264.50 కోట్లు వచ్చిందని తెలిపారు. 2024-25 సంవత్సరంలో పన్నుల రూపంలో ఎక్సైజ్ శాఖకు రూ. 7000 కోట్ల సొమ్ము వచ్చిందని వెల్లడించారు.

Also Read:Meerut Murder: మీరట్ మర్డర్ కేసులో ట్విస్ట్.. జైలులో ముస్కాన్‌ ప్రెగ్నెన్సీ నిర్ధారణ..

2024-25లో సంవత్సరంలో 531 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. గత సంవత్సరంతో పోలిస్తే బీర్ల అమ్మకాల్లో 3 శాతం తగ్గుదల కనిపించిందని తెలిపారు. బీర్ల కంపెనీలు 15 రోజుల పాటు సరపరా నిలిపి వేయడంతో తగ్గుదల కనిపించింది. బీర్ల ధరలు పెంచడంతో బీర్ల అమ్మకాలు కొద్దిమేర తగ్గిపోయాయి. 2024-25 అర్థిక సంవత్సరంలో 2 శాతం లిక్కర్‌ సెల్స్‌ పెరిగాయి. గతంతో పోలిస్తే ప్రతి సంవత్సరంలాగ తెలంగాణలో మద్యం అమ్మకాల్లో పెరుగుదల కనిపించిందని అధికారులు తెలిపారు.

Exit mobile version