Site icon NTV Telugu

Diabetes Tablets: డయాబెటిస్ మందుల ధరలో భారీ తగ్గింపు.. రూ. 60 నుంచి రూ. 5కి తగ్గిన ట్యాబ్లెట్ ధరలు

Diabatis

Diabatis

డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్. మధుమేహ చికిత్సకు ఉపయోగించే ట్యాబ్లెట్స్ ధరలు భారీగా తగ్గాయి. అత్యంత చౌకగా మారాయి. డయాబెటిస్‌లో ఉపయోగించే ఎంపాగ్లిఫ్లోజిన్ అనే ఔషధం పేటెంట్ గడువు ముగిసినందున భారత్ లో దాని ధర బాగా తగ్గింది. దీని ధర ఇప్పుడు దాదాపు 90 శాతం తగ్గింది. రూ. 60 నుంచి రూ. 5కి ట్యాబ్లెట్ ధరలు తగ్గిపోయాయి. పేటెంట్ గడువు ముగిసిన తర్వాత దాని జనరిక్ మందులు మార్కెట్లోకి వచ్చాయి.

Also Read:Delhi Capitals Captain: కేఎల్‌ రాహుల్‌కు షాక్.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా టీమిండియా ఆల్‌రౌండర్‌!

జర్మన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ బోహ్రింగర్ ఇంగెల్హీమ్ అభివృద్ధి చేసిన ఎంపాగ్లిఫ్లోజిన్, జార్డియన్స్ పేరుతో మార్కెట్లో అమ్ముడవుతోంది. టైప్-2 డయాబెటిస్ రోగులు ఈ మాత్రను తీసుకుంటారు. ఇది రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. గతంలో జార్డియన్స్ టాబ్లెట్ ధర రూ.60 ఉండగా, ఇప్పుడు దానిని రూ.5.50కి తగ్గించారు. మ్యాన్‌కైండ్, ఆల్కెమ్, గ్లెన్‌మార్క్ వంటి ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఎంపాగ్లిఫ్లోజిన్ జనరిక్ ఔషధాలను మార్కెట్లోకి విడుదల చేశాయి.

Also Read:American Airlines plane: 172 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో మంటలు.. చివరకు

మ్యాన్‌కైండ్ ఫార్మా విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. 10 mg వేరియంట్ ఎంపాగ్లిఫ్లోజిన్ టాబ్లెట్ ధర రూ.5.49, 25 mg వేరియంట్ టాబ్లెట్ ధర రూ.9.90గా నిర్ణయించారు. ఆల్కెమ్ దీనిని ఎంపోనార్మ్ పేరుతో ప్రారంభించింది. దాని ధరను దాదాపు 80 శాతం తక్కువకే విక్రయిస్తోంది. గ్లెన్‌మార్క్ ఫార్మా దీనిని గ్లాంపా పేరుతో 10, 25 mg రెండు వేరియంట్‌లలో ప్రవేశపెట్టింది.

Exit mobile version