NTV Telugu Site icon

SSC Recruitment 2024 : సింగరేణిలో భారీగా ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..

Singarenii

Singarenii

నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల పలు సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు వరుసగా నోటిఫికేషన్ లను రిలీజ్ చేస్తూ వస్తుంది.. తాజాగా మరోసారి సింగరేణిలో ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 327 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మొత్తం పోస్టులు..327

పోస్టుల వివరాలు..

ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌: మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ(ఈ-ఎం), ఈ2 గ్రేడ్‌-42, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ(సిస్టమ్స్‌), ఈ2 గ్రేడ్‌-07.

నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌: జూనియర్‌ మైనింగ్‌ ఇంజనీర్‌ ట్రెయినీ(జేఎంఈటీ), టీ-ఎస్‌ గ్రేడ్‌ సీ-100, అసిస్టెంట్‌ ఫోర్‌మ్యాన్‌ ట్రెయినీ(మెకానికల్‌)టీ-ఎస్‌ గ్రేడ్‌ సీ-09, అసిస్టెంట్‌ ఫోర్‌మ్యాన్‌ ట్రెయినీ(ఎలక్ట్రికల్‌)టీ-ఎస్‌ గ్రేడ్‌ సీ-24, ఫిట్టర్‌ ట్రెయినీ, క్యాట్‌ 1-47, ఎలక్ట్రీషియన్‌ ట్రెయినీ, క్యాట్‌ 1-98 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు..

అర్హతలు..

ఈ పోస్టులకు అప్లై చేసుకొనే అభ్యర్థులు డిగ్రీ పీజీ, ఐఐటీ, డిప్లొమా లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి..

వయసు..

పోస్ట్‌ను అనుసరించి జూన్‌ 1, 2024 నాటికి కనీస వయసు 18 ఏళ్లు, గరిష్ట వయసు 30 ఏళ్లు ఉండాలి. రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది..

ఎంపిక ప్రక్రియ..

రాత పరీక్ష, మెరిట్‌ జాబితా రూపొందిస్తారు. టైపింగ్, డేటాఎంట్రీ, కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ విభాగాల్లో స్కిల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు..

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం తేదీ, చివరి తేదీలు : 15.04.2024 నుంచి 04.05.2024 వరకు అప్లై చేసుకోవచ్చు..
వెబ్‌సైట్‌: https://scclmines.com/.. ఈ పోస్టుల గురించి మరిన్ని విషయాలను తెలుసుకోవాలంటే ఈ వెబ్ సైట్ ను పరిశీలించండి..