NTV Telugu Site icon

Kerala News: కేరళలో విరిగిపడిన కొండచరియలు.. ఏడుగురి మృతి! శిథిలాల కింద వందలాది మంది

Wayanad Landslides

Wayanad Landslides

Huge Landslides Strike in Wayanad: కేరళలోని వాయనాడ్ జిల్లా మెప్పాడి సమీపంలోని పలు కొండ ప్రాంతాల్లో ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో వందలాది మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (కేఎస్‌డీఎంఎ) బాధిత ప్రాంతాలకు ఫైర్‌ఫోర్స్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను పంపి సహాయక చర్యలు చేపట్టింది. అదనపు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం కూడా వాయనాడ్‌కు వెళుతున్నట్లు సమాచారం.

కన్నూర్ డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్ బృందాలు కూడా రెస్క్యూ ప్రయత్నాలలో భాగం అయ్యాయి. కొండచరియలు కింద చాలా మంది చిక్కుకుపోయి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. భారీ వర్షాల కారణంగానే కొండచరియలు విరిగిపడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఏడుగురి మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Show comments