NTV Telugu Site icon

BEL Requirements : బెల్ లో భారీగా ఉద్యోగాలు భర్తీ.. నెలకు జీతం రూ.90వేలు..

Job Vacancy

Job Vacancy

ఈరోజుల్లో చదువుకున్న వారి సంఖ్య పెరుగుతుంది.. కానీ జాబ్స్ పొందేవారి సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుంది.. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలను వదులుతున్నా కూడా నిరుద్యోగ సమస్య మాత్రం అస్సలు తగ్గలేదు.. తాజాగా తెలంగాణా ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. హైదరాబాద్‌లోని ప్రభుత్వ రంగ సంస్థ.. బెల్ శాశ్వత ప్రాతిపదికన 32 ఇంజినీరింగ్‌ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ పోస్టులకు అర్హతలు, జీతం వివరాలను తెలుసుకుందాం..

మొత్తం పోస్టుల సంఖ్య.. 32

టెక్నీషియన్‌ సీ-17 పోస్టులు

ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రెయినీ-12 పోస్టులు

జూనియర్‌ అసిస్టెంట్‌-3 పోస్టులు..

అర్హతలు..

ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రెయినీ: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ట్రేడ్‌లో మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా.

టెక్నీషియన్‌ సీ-17: ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐ (ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌/ ఎలక్ట్రికల్‌)తోపాటు ఏడాది అప్రెంటిస్‌షిప్‌ పూర్తిచేయాలి లేదా ఎస్‌ఎస్‌ఎల్‌సీ పాసై, మూడేళ్ల నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ సర్టిఫికెట్‌ కోర్సు చేయాలి.

జూనియర్‌ అసిస్టెంట్‌-3: బీకాం/ బీబీఎం

వయోపరిమితి..

ఈ పోస్టులకు అప్లై చేసుకొనే అభ్యర్థులు వయసును కూడా చూసుకోవాలి.. ఈ పోస్టులకు అప్లై చేసుకొనేవారు 28 సంవత్సరాలు ఉండాలి..

జీతం..

ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రెయినీ పోస్టుకు రూ.24500 నుంచి రూ.90000. టెక్నీషియన్, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.21500 నుంచి రూ.82000 వేల వరకు ఉంటుంది..

దరఖాస్తు ఫీజు..

జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌లకు దరఖాస్తు ఫీజు రూ.250. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు ఫీజు లేదు…

ఎంపిక ప్రక్రియ..

ఈ పోస్టులకు అప్లై అభ్యర్థులను షార్ట్‌లిస్ట్, రాత పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.. ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవాలి. అప్లయ్ చేసుకోవడానికి చివరి తేదీ జులై 11, 2024.. ఈ పోస్టులకు అప్లై చేసుకొనే అభ్యర్థులు అధికార వెబ్ సైట్ లో చూసి అప్లై చేసుకోవచ్చు…