NTV Telugu Site icon

Uttarakhand: గర్జియా మాత ఆలయంలో భారీ అగ్నిప్రమాదం.. దుకాణాలు దగ్ధం

Fire Accident

Fire Accident

ఉత్తరఖండ్లోని రాంనగర్ సమీపంలోప ఉండే గర్జియా మాత ఆలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో దుకాణాలు దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఆలయం కోసి నది ఒడ్డున ఉంది.

Rahul Gandhi: నిరుద్యోగ యువతకు రాహుల్ గాంధీ హామీ.. కొత్త చట్టం తీసుకొస్తాం..!

మ్యాగీ టీ కియోస్క్‌లోని స్టవ్‌ నుంచి మంటలు లేచి పైన అమర్చిన టార్పాలిన్‌కు మంటలు వ్యాపించినట్లు అక్కడి స్థానికులు భావిస్తున్నారు. మరోవైపు.. ఈదురు గాలులు వీయడంతో మంటలు వేగంగా వ్యాపించి అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు, దుకాణదారులు తమ వద్ద ఉన్న సామాన్లు వదిలేసి పరుగులు తీయాల్సి వచ్చింది. కొంతమంది ఔత్సాహిక యువకులు కూడా కోసి నది నుండి నీటిని బకెట్లతో తీసుకొని మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. ఇంతలో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకోవడంతో మంటలను ఆర్పేశారు.

Heat Wave-rainfall Alert: వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు ఇవే

గర్జియా ఆలయానికి సమీపంలో డజన్ల కొద్దీ స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రసాదం మొదలైనవి అమ్ముతారు. మాగీ, పకోరీ, టీ మొదలైన వాటిని విక్రయించే ముడి దుకాణాలు కూడా ఉన్నాయి. మంటల ధాటికి ఈ దుకాణాలన్నీ దగ్ధమయ్యాయి. అయితే.. అమ్మవారు ఉన్న ఆలయానికి ఎలాంటి నష్టం జరగలేదు. కాగా.. మంటలను అదుపులోకి తెచ్చామని, నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారని, అగ్నిప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నామని డీఎం వందనా సింగ్ తెలిపారు.