ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సోమవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నావెల్టీ సినిమా వెనుక ఉన్న కెనరా బ్యాంక్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే మంటలు భవనం మొత్తం వ్యాపించడంతో.. కొందరు ఉద్యోగులు భవనంపై నుండి దూకి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే పనిలో నిమగ్నమై ఉన్నాయి. ఇదిలా ఉంటే.. బ్యాంకులో మంటల దాటికి బయటకురాకుండా 50 మంది చిక్కుకున్నట్లు సమాచారం అందుతోంది. అయితే మంటలను ఆర్పితేనే లోపల ఎవరైనా ఉన్నారన్నది తెలుస్తోంది.
Khalistani terrorist Pannun: ఎయిర్ ఇండియాను బెదిరించిన ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూన్‌పై ఎన్‌ఐఏ కేసు
ఈ అగ్నిప్రమాదం జరిగిన కెనరా బ్యాంక్ బ్రాంచ్ నావల్ కిషోర్ రోడ్‌లో ఉంది. అయితే బ్యాంకు లోపల నుంచి అరుపుల శబ్దాలు రావడంతో ప్రజలు పెద్ద ఎత్తున గూమికూడారు. దాదాపు 50 మంది బ్యాంకులో చిక్కుకుపోయారన్న సమాచారంతో.. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందులో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు భవనం అద్దాలు పగలగొట్టి అందులో నుంచి రక్షిస్తున్నారు. అయితే ఎంత మందిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారనే సమాచారం అందుబాటులో లేదు.
Vini Raman: టీమిండియా అభిమానులపై మ్యాక్స్వెల్ భార్య ఆగ్రహం.. తీవ్ర పదజాలంతో విసుర్లు
ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఏడీఎస్పీ మనీషా సింగ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సకాలంలో అగ్నిమాపక దళ వాహనాల ద్వారా మంటలను అదుపు చేశారని తెలిపారు. అలాగే లోపల ఉన్న వారందరినీ సురక్షితంగా బయటకు తీశారని.. అగ్నిప్రమాదానికి కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదని చెప్పారు. ఈ ఘటనపై అగ్నిమాపక సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నారు.