హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గగన్‌పహాడ్ లో ఈ ఫైర్ యాక్సిడెంట్ సంభవించడంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులతో బయటకు పరుగులు తీశారు. థర్మాకోల్ తయారీ కంపెనీలో ఈ మంటలు చెలరేగడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో సమాచారం అందుకున్న ఆగ్నిమాపక శాఖ సిబ్బంది ఆరు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పక్కనే ఉన్న ఆయిల్ ఫ్యాక్టరీకి కూడా మంటలు వ్యాపించే అవకాశం ఉందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, థర్మకోల్ కంపెనీ నుంచి దట్టమైన పొగ వస్తుండటంతో మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పలేకపోతున్నారు. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నట్లు సమాచారం. అయితే, మరోవైపు పొగ కారణంగా స్థానికులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు.. ఈ ప్రమాదంలో ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు కూడా తెలియాల్సి ఉంది. రంగోలి ఈపీఎస్ థర్మకోల్ కంపెనీలో అగ్ని ప్రమాదంతో భారీగా ఎగిసిపడుతున్న మంటలు దట్టమైన నల్లని పొగతో కిలోమీటర్ల దూరంలో నల్లని పొగతో వెదజల్లుతుంది.. రెండు కోట్ల మిషనరీ, ముడి సరుకు పూర్తిగా అగ్నికి అహుతయింది.. దీంతో కంపెనీ యజమాని కన్నీరు మున్నీరు అవుతున్నారు.
Fire Accident: హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం.. భయాందోళనలో స్థానికులు

Fire Accident