NTV Telugu Site icon

Fire Accident: భారీ అగ్నిప్రమాదంలో టాటా ప్లాంట్..

Fire Accident

Fire Accident

Fire Accident: టాటా గ్రూప్ కంపెనీ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూరు సమీపంలోని టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం. శనివారం ఉదయం టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో మంటలు చెలరేగాయి. ఈ టాటా తయారీ యూనిట్ నుంచి నల్లటి పొగ బయటకు రావడం కనిపించింది. ఫ్యాక్టరీలో మంటలు చెలరేగినప్పుడు 1500 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ముగ్గురు ఉద్యోగులను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించామని, వారి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసు అధికారులు తెలిపారు. అగ్నిమాపక దళం వాహనాలు, సిబ్బంది సహాయక చర్యలు మంటలను ఆర్పే పనిలో ఉన్నారు.

Also Read: Suicide Case: దారుణం.. నలుగురు వికలాంగ కూతుళ్లతో సహా తండ్రి ఆత్మహత్య.!

అగ్నిప్రమాదాన్ని ధృవీకరిస్తూ, టాటా ఎలక్ట్రానిక్స్.. కంపెనీ అన్ని అత్యవసర ప్రోటోకాల్లను అనుసరించింది. ఉద్యోగులందరి భద్రతను నిర్ధారించింది. అగ్నిప్రమాదానికి కారణాన్ని విచారిస్తున్నారు. ప్లాంట్ కు ఎంత నష్టం జరిగిందో అంచనా వేస్తున్నారు.

Also Read: Bandi Sanjay: మమ్మీ, డాడీ కల్చర్ మనకొద్దు… అమ్మానాన్నే ముద్దు..