NTV Telugu Site icon

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. 11 మంది మావోల హతం

Secutri

Secutri

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. నారాయణపూర్‌ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో 11 మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఘటనను ఐజీ సుందర్‌రాజ్‌ వెల్లడించారు. అభుజ్మద్‌లోని కోహ్కమేటా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. వివిధ భద్రతా దళాలకు చెందిన సిబ్బంది నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో ఉన్నప్పుడు కాల్పులు చోటుచేసుకున్నాయని అధికారి తెలిపారు. జిల్లా రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, వివిధ జిల్లాలకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులతో కూడిన ఈ ఆపరేషన్ సోమవారం ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: UP Stampede: ఘోర విషాదం.. యూపీ తొక్కిసలాటలో 107 పైగా మృతి..

కోహ్కమేటా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో సోమవారం అపరేషన్‌ ప్రారంభించాయని తెలిపారు. గుర్తించిన మావోయిస్టులు కాల్పులకు దిగారని, దీంతో బలగాలు కూడా ఎదురుకాల్పులు జరిపినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఇంకా ఆపరేషన్‌ కొనసాగుతోందని మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య పెరిగే అవకాశముందని సుందర్‌రాజ్‌ తెలిపారు.

ఇది కూడా చదవండి: US Video: మహిళపై పిడిగుద్దులు.. లొంగిపోయిన మిలియనీర్ బ్యాంకర్ జోనాథన్