NTV Telugu Site icon

Drugs Mafia: హైదరాబాదులో మరొకసారి భారీగా డ్రగ్స్ పట్టివేత.. ఏకంగా 8.5 కిలోల ఆంఫేటమైన్ డ్రగ్స్..

Drugs

Drugs

Drugs Mafia In Hyderabad: హైదరాబాదులో మరొకసారి ఈ భారీగా డ్రగ్స్ పట్టివేత జరిగింది. అమ్మాయిలపై అత్యాచారాలు చేసేందుకు డ్రస్సు వాడుతున్నారు యువత. ఫ్రెండ్షిప్ పేరుతో తోటి అమ్మాయిలను తీసుకువెళ్లి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలుపుతున్నారు యువకులు. ఆంఫేటమైన్ డ్రగ్స్ డ్రక్కుతో అమ్మాయిలపై అగ్యాత్యాలకు యువకులు పాల్పడుతున్నట్లు హైదారాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలియ చేసారు. ఈ నేపథ్యంలో బోయిన్ పల్లి పరిధిలో 8.5 కిలోల ఆంఫేటమైన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈ డ్రగ్ ను నేరుగా పీల్చొచ్చనని., లేదా కూల్ డ్రింక్ లో కలుపుకుని తీసుకోవచ్చని అధికారులు తెలిపారు.

Gaddam Prasad Kumar: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్..

అమ్మాయిలకు ఈ డ్రగ్ ను కూల్ డ్రింక్ లో కలిపి ఇచ్చి అఘాయిత్యాలకు యువత పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ కేసులో సంగారెడ్డి కి చెందిన కుంచల నాగరాజు తోపాటు మరో ముగ్గురుని అరెస్ట్ చేసారు పోలీసులు. నాగరాజు తోపాటు సహకరించిన వినోద్ కుమార్, కుంటి శ్రీశైలం ను అరెస్ట్ చేసారు. ఈ కేసును నమోదు చేసుకొని దర్యాప్తును మొదలు పెట్టారు అధికారులు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంగారెడ్డి కి చెందిన అంజిరెడ్డి.. లోకల్ గా ఆల్ఫ్రాజోలం తయారు చేస్తుంటాడు. అతని శిష్యుడు నాగరాజు. అంజిరెడ్డి ఆమ్ఫెటమైన్ డ్రగ్ కూడా తయారు చేసి నాగరాజు కి ఇచ్చాడు. దాచి ఉంచమని చెప్పాడు. కొన్ని నెలల క్రితం హెచ్ న్యూ పోలీసులు చేసిన రైడ్ లో అంజిరెడ్డి ని సంగారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపారు. అంజిరెడ్డి జైలు నుంచి వస్తాడేమో అని నాగరాజు ఎదురుచూశాడు. ఎక్కువ కాలం తనతో డ్రగ్స్ ఉంచుకోలేక.. నాగరాజు వాటిని అమ్మే ప్రయత్నం చేశాడు. మార్కెట్లో ఈ డ్రగ్ ధర కిలో కోటి రూపాయల పైనే ఉంటుంది. కానీ., నాగరాజు కిలోకి 50 లక్షలు వచ్చినా సరే.. ఆముదం అని ప్రయత్నించాడు.