Amazon Prime Day Sale 2024: అమెజాన్ బ్రాండ్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు.. కాంబో డీల్స్ కూడా!
- అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2024
- ప్రైమ్ మెంబర్స్‌కు మాత్రమే
- అమెజాన్ బ్రాండ్ ఉత్పత్తులపై డిస్కౌంట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Discounts Amazon Products in Amazon Prime Day Sale 2024: భారతదేశంలో ‘అమెజాన్ ప్రైమ్ డే సేల్’ 2024 సమీపిస్తోంది. ఈ సేల్ జులై 20, 21 తేదీల్లో జరగనుంది. ఈ సేల్ కేవలం ప్రైమ్ మెంబర్స్‌కు మాత్రమే అన్న విషయం తెలిసిందే. ఈ రెండు రోజుల్లో అనేక వస్తువులు తగ్గింపు ధరల్లో లభించనున్నాయి. స్మార్ట్‌ఫోన్స్, ఇయర్‌ఫోన్స్, ట్యాబ్‌ల నుంచి.. వ్యక్తిగత ఎలక్ట్రానిక్ ఐటెమ్‌ల వరకు అన్ని వస్తువులపై భారీగా రాయితీ ఉండనుంది. అంతేకాదు బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉంటాయి. ముఖ్యంగా అమెజాన్ బ్రాండ్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు ఉండనున్నాయి.
ఈ సేల్‌లో తమ బ్రాండ్‌తో వస్తోన్న స్మార్ట్ హోమ్ పరికరాలపై భారీ ఎత్తున రాయితీ ఇస్తున్నట్లు అమెజాన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఫైర్ స్టిక్, అలెక్సాతో కూడిన ఎకో స్మార్ట్ స్పీకర్లు.. అలెక్సా అనుసంధానిత స్మార్ట్ హోమ్ పరికరాలపై 55 శాతం వరకు రాయితీ ఇస్తోంది. రూ.3,999 ధర ఉన్న అమెజాన్ ఎకో పాప్‌ను రూ.2,499కే కొనుగోలు చేయొచ్చు. రూ.8,999గా ఉన్న ఎకో షో 5 (2 జెన్)ను రూ.3,999కే లభిస్తోంది. రూ.13,999గా ఉన్న ఎకో షో 8 (2 జెన్) రూ.8,999కు అందుబాటులో ఉంటుంది.
Also Read
Also Read: Dhammika Niroshana Dead: కుటుంబం ఎదుటే.. దారుణ హత్యకు గురైన మాజీ క్రికెటర్!
అమెజాన్ కాంబో డీల్స్‌ను కూడా ప్రకటించింది. విప్రో 9W స్మార్ట్ బల్బ్‌తో కలిపి ఎకో డాట్ (5 జెన్) రూ.4,749కే అందుబాటులో ఉంటుంది. క్లాక్‌తో కూడిన ఎకో డాట్ (4 జెన్), విప్రో 9W స్మార్ట్ బల్బ్ రూ.3,749కు కొనుగోలు చేయొచ్చు. విప్రో 9W స్మార్ట్ బల్బ్‌తో కలిపి ఎకో పాప్ రూ.2,749కి లభిస్తోంది. అమెజాన్ స్మార్ట్ ప్లగ్‌తో కలిపి విప్రో బల్బ్ రూ.2,948కే లభించనుంది. ఇక 56 శాతం డిస్కౌంట్ అనంతరం అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ రూ.2,199కు లభించనుంది. ఫైర్ టీవీ స్టిక్ 4కేపై 43 శాతం, ఇన్‌బిల్ట్ ఫైర్ టీవీతో కూడిన స్మార్ట్ టెలివిజన్‌పై 50 శాతం రాయితీ ఉంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?