Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ గత మూడు రోజులుగా కొనసాగుతుంది. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి బయట క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది. ఇక, ఫ్రీ దర్శనానికి దాదాపు 16 గంటలకు పైగా సమయం పడుతుంది. కాగా, 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 4 గంటల టైం పడుతోందని వెల్లడించింది. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 12 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి దాదాపు 5 గంటల సమయం పడుతుంది. ఇక.. శనివారం 90 వేలకు పైగా మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అందులో 33, 844 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకోగా.. స్వామివారి హుండీ ఆదాయం 3 కోట్ల రూపాయలుగా లెక్క తేలింది.
Read Also: Allu Arjun : ఘనంగా జరిగిన దర్శకుల దినోత్సవం.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అల్లు అర్జున్..
అయితే, తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉన్నారు. ఇక, సర్వదర్శనానికి వెళ్లే భక్తులు దాదాపు 3 కిలో మీటర్లకు పైగా కాలినడకన క్యూలైన్లో నడవాల్సిన పరిస్థితి ఏర్పాడింది. దీంతో టీటీడీ అధికారులు ఫ్రీ దర్శనానికి వచ్చే భక్తులకు సరైన సౌకర్యాలను కల్పించకపోవడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సర్వదర్శనం కోసం వేచి ఉన్నా భక్తులకు కనీస సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. మరోవైపు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచి సైతం పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు పోటెత్తారు.