కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పుత్తా కుటుంబం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. 15 ఏళ్ల తర్వాత కమలాపురం కోటపై టీడీపీ జెండా ఎగరబోతుందని ధీమా వ్యక్తం చేశారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి గెలువగా.. 2014, 2019లో జగన్ మేనమామ పి. రవీంధ్రనాథ్ రెడ్డి వరుసగా 2 సార్లు గెలిచారు. మరోవైపు వరుసగా ఓడిపోయినా ప్రతి నిత్యం ప్రజల్లోనే ఉంటూ… ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ, అందరికీ అందుబాటులో ఉంటున్నామని పుత్తా ఫ్యామిలీ చెబుతోంది. నాలుగు సార్లు ఓడిపోయిన పుత్తాకు ఈసారి అవకాశం ఇవ్వాలని.. ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు.
Read Also: Megha Akash: పెళ్లి పీటలెక్కనున్న మరో హీరోయిన్?
ఈ నేపథ్యంలో పుత్తా తండ్రీ కోడుకులు పుత్తా నరసింహారెడ్డి, పుత్తా చైతన్య రెడ్డి ఒకేసారి నామినేషన్ దాఖలు చేయడం ఆసక్తి రేపుతోంది. వాస్తవానికి ఈసారి టీడీపీ అధిష్టానం ఇంచార్జి పుత్తా నరసింహారెడ్డికి బదులుగా పుత్తా చైతన్యరెడ్డికి టికెట్ ప్రకటించింది. కానీ క్యాడర్ మాత్రం పుత్తా నరసింహారెడ్డినే పోటీ చేయాలని కోరుతున్నారు. పార్టీ నిర్ణయం మేరకు చైతన్యరెడ్డి, పార్టీ కోసం నరసింహారెడ్డి నామినేషన్ వేసినట్లు తెలుస్తోంది. ఈ నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పుత్తా అభిమానులు, ప్రజలతో కమలాపురం దద్దరిల్లిపోయింది.
Read Also: US Report: అమెరికా మానవహక్కుల నివేదికపై భారత్ ఆగ్రహం..
