Site icon NTV Telugu

Blast in Kuppam: కుప్పంలో భారీ పేలుడు

Blast

Blast

Blast in Kuppam: చిత్తూరు జిల్లా కుప్పంలో భారీ పేలుడు సంభవించింది.. కుప్పం పట్టణంలోని కొత్తపేట పెద్దపల్లి గంగమాంబ దేవస్థానం వీధిలోని ఓ ఇంట్లో నాటు బాంబు సహా జిలెటిన్ స్టిక్స్ పేలినట్టు తెలుస్తోంది.. పేలుడు ధాటికి చెల్లాచెదురుగా పడిపోయారు మురుగేష్, ధనలక్ష్మీ దంపతులు.. గుర్తు తెలియని దుండగులు ఆ దంపతుల ఇంటి గుమ్మం వద్ద… నాటు బాంబు, జిలెటిన్‌స్టిక్స్‌ పెట్టి పేల్చినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఈ పేలుడుదాటికి ఇల్లు ధ్వంసం కాగా.. దంపతుల పరిస్థితి అత్యంత విషమంగా మారిపోయింది.. దీంతో.. కుప్పం పీఈఎస్ కు దంపతులను తరలించారు స్థానికులు.. ఇక, స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి.. ఎందుకు వారి ఇంటి వద్ద భారీ పేలుడు జరిపారు అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.. దంపతులను టార్గెట్‌ చేసిన దుండగులు పేలుళ్లకు పాల్పడ్డారా? లేక ఇంకేదైనా కారణముందా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసుల.. అయితే, స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది..

Exit mobile version