Site icon NTV Telugu

Asteroid: 51వేల కి.మీ. వేగంతో భూమిపైకి దూసుకొస్తున్న ఆస్టరాయిడ్

Asteroid Earth

Asteroid Earth

Asteroid: అంతరిక్షంలో ప్రతిరోజూ శాస్త్రవేత్తలు కొత్త వాటిని గుర్తిస్తూనే ఉన్నారు. ఆ క్రమంలోనే తాజాగా ఓ ఆస్టరాయిడ్ భూమివైపు వేగంగా దూసుకొస్తుందని కనుగొన్నారు. ఎన్నో గ్రహశకలాలు ఇప్పటి వరకు భూమికి అత్యంత సమీపంగా వచ్చి వెళ్తుంటాయి. అయితే.. ప్రస్తుతం దూసుకొస్తున్న ఆస్టరాయిడ్‌లను మాత్రం తేలికగా తీసుకోవద్దని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడూ భూమికి సమీపంగా వస్తున్న ఆస్టరాయిడ్‌ 2022 వైజీ5 విషయంలో అప్రమత్తంగా ఉండాలని నాసా హెచ్చరిస్తోంది. డిసెంబర్‌ 30వ తేదీన ఇది భూమికి సమీపంగా.. 3.1 మిలియన్‌ కిలోమీటర్ల దూరంతో ఇది ప్రయాణించనుందట. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిణామమేనని నాసా అంటుంది.

Read Also : IPS Anjani Kumar : తెలంగాణ ఇన్ చార్జ్ డీజీపీగా అంజనీకుమార్

గంటకు 51,246 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తోందని, ఈ వేగం ఒక హైపర్‌సోనిక్‌ బాలిస్టిక్‌ మిస్సైల్‌ ప్రయాణ వేగం కంటే ఐదు రేట్లు ఎక్కువని నాసా ప్రకటించింది. అయితే దీని వల్ల జరిగే నష్టతీవ్రత గురించి మాత్రం నాసా స్పష్టత ఇవ్వలేదు. ఆస్టరాయిడ్‌ 2022 వైజీ5ను డిసెంబర్‌ 24నే నాసా గుర్తించింది. ఇది అపోలో గ్రూప్‌ గ్రహశకలాలకు చెందింది. సూర్యుడికి గరిష్టంగా 398 మిలియన్‌ కిలోమీటర్ల దూరం, కనిష్టంగా 119 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని.. 829 రోజులకు సూర్యుడి చుట్టూ ఒక భ్రమణం పూర్తి చేసుకుంటుందని ప్రకటించింది.

Exit mobile version