NTV Telugu Site icon

Andhra Pradesh: మద్యం దుకాణాలకు భారీగా అప్లికేషన్లు

Liquor Shops

Liquor Shops

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం భారీగా దరఖాస్తులు అందాయి. ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ, అలాగే ఆఫ్‌లైన్‌లోనూ లైసెన్సుల దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. వీటికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారి నంచి 2 లక్షల నాన్ రిఫండబుల్ మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. ఇప్పటివరకు 3396 మద్యం దుకాణాలకు 39,259 దరఖాస్తులు వచ్చాయి. మరో రోజు గడువు ఉందనగా మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. రేపు 5 గంటల వరకు దరఖాస్తులను ఎక్సైజ్ శాఖ తీసుకోనుంది. గడువు ముగిసేలోగా 50 వేలకు పైగా దరఖాస్తులు వస్తాయని అంచనా.

Read Also: Vijayawada: రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. ఉరేసుకుని భార్య సూసైడ్

మద్యం దుకాణాల దరఖాస్తుల ద్వారా ఇప్పటి వరకు రూ. 785.18 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. సిండికేట్‌ను కట్టడి చేయడం, మద్యం షాపుల దరఖాస్తుల్లో ఎమ్మెల్యేల ప్రమేయాన్ని నివారించే ప్రయత్నం చేయడంతో దరఖాస్తులు భారీగా దాఖలవుతున్నాయి. ఆన్ లైన్‌లో మద్యం దరఖాస్తులు దాఖలు చేసేలా ఎక్సైజ్ శాఖ ప్రోత్సహిస్తోంది.