Site icon NTV Telugu

T20 World Cup 2026: రేపే T20 వరల్డ్ కప్ 2026 కోసం భారత జట్టు ప్రకటన.. తుది జట్టులో గిల్, శాంసన్?

World

World

T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8వ తేదీ వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ చివరి మ్యాచ్ ముగిసిన తర్వాత రేపు ( డిసెంబర్ 20న) భారత జట్టును బీసీసీఐ ప్రకటించనుంది. టీ20 వరల్డ్‌కప్‌కు ముందు భారత్‌కు ఇంకా ఐదు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఉన్నాయి. అందుకే ప్రస్తుతం ప్రకటించే జట్టే మెగా టోర్నీలో ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెలెక్టర్ల ముందున్న అతి పెద్ద సవాల్ ఆటగాళ్ల ఫాంతో పాటు సమతూకం కలిగిన జట్టును ఎంపిక చేసే అవకాశం ఉంది.

Read Also: Bangladesh: దారుణం.. హిందూ వర్కర్‌ని చంపి.. చెట్టుకు కట్టేసి తగులబెట్టిన ముస్లింలు!

అయితే, ప్రస్తుతం టీమిండియాకు ప్రధాన ఆందోళనగా శుభ్‌మన్ గిల్‌, సూర్యకుమార్ యాదవ్‌ల ఫామ్ మారింది. జట్టు కెప్టెన్‌గా సూర్య కుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ గిల్ ఉన్న నేపథ్యంలో వీరిద్దరిపై సెలెక్టర్లు కఠిన నిర్ణయం తీసుకుంటారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు, టీ20ల్లో అద్భుతమైన రికార్డు ఉన్న యశస్వి జైస్వాల్‌ను ఇటీవల జట్టులోకి తీసుకోకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. వరల్డ్‌కప్‌కు ముందు అతనికి తిరిగి అవకాశం కల్పిస్తారా అనే ఆసక్తి నెలకొంది.

Read Also: This Week OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే

ఇక, వికెట్‌కీపర్‌ విభాగంలో కూడా ఇంకా క్లారిటీ లేదు. ఆసియా కప్‌ 2025 నుంచి జితేశ్ శర్మ, సంజూ శాంసన్‌లు కీపర్లుగా కొనసాగిస్తున్నప్పటికీ, జితేశ్ నుంచి చెప్పుకోదగిన ఇన్నింగ్స్ రాలేదు.. అయితే, శాంసన్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎడాపెడా మార్చి చివరకు ప్లేయింగ్ ఎలెవన్ నుంచే తొలగించారు. దీంతో ఇషాన్ కిషన్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్‌లకు మళ్లీ టీ20ల్లో అవకాశం కల్పించే ఆలోచన సెలెక్టర్లకు ఉందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు శ్రేయాస్ అయ్యర్ డిసెంబర్ 2023 తర్వాత అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడలేదు. ప్రస్తుతం గాయానికి చికిత్స తీసుకుంటున్న అతడు వరల్డ్‌కప్ అవకాశాలు అనిశ్చితంగా మారాయి.

Read Also: Astrology: డిసెంబర్‌ 19, శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్‌న్యూస్..!

అలాగే, దక్షిణాఫ్రికా సిరీస్‌కు రింకు సింగ్ ను పక్కన పెట్టేశారు. గత కొంతకాలంగా జట్టులో రెగ్యులర్‌గా ఉన్న రింకు, వరుసగా రెండో టీ20 వరల్డ్‌కప్‌ను కోల్పోతాడా అనే చర్చ సైతం జరుగుతోంది. టీ20 వరల్డ్‌కప్ 2026 కోసం భారత జట్టు ఎంపికపై అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలి.

Exit mobile version