AA22xA6 : అట్లీ సినిమాలో అల్లు అర్జున్ నాలుగు డిఫరెంట్ రోల్స్ పోషిస్తున్నాడంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబాయిలో షూటింగ్ సైలెంగ్‌గా సాగిపోతోంది. పుష్ప2 తర్వాత అల్లు అర్జున్ – అట్లీ దర్శకత్వంలో నటిస్తున్న ఈ సినిమా AA22xA6 పేరుతో సినిమా మొదలైంది. అల్లు అర్జున్ కోసం అట్లీ జవాన్ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నాడు. జవాన్‌లో షారూక్‌ను రకరకాల గెటప్స్‌లో చూపించినట్టు బన్నీని కూడా డిఫరెంట్ షేడ్స్‌లో చూపిస్తాడట. దీంతో బన్నీని ఎలా ఎన్ని రకాలుగా డైరెక్టర్ చూపించబోతున్నారన్న ఆసక్తి అల్లు ఫ్యాన్స్‌లో మొదలైంది. అల్లు అర్జున్, అట్లీ మూవీ షూటింగ్ ముంబాయిలో శరవేగంగా సాగుతోంది. బన్నీ అయితే మూడు నెలలుగా ముంబాయ్‌లోనే ఎక్కువగా వుంటున్నాడు. ఇందులో బన్నీ నాలుగు డిఫరెంట్ రోల్స్‌లో కనిపిస్తున్నాడన్న టాక్ బైటకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
ఈ వార్తలో నిజమెంత అన్న విషయమై ఆరాతీయగా ఈ సినిమాలో హీరోది డ్యూయెల్ రోల్ మాత్రమేనని తెలిసింది. రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తాడని ముందుగా ఒక గెటప్‌కు సంబంధించిన సీన్స్ తీస్తున్నారని సమాచారం. పుష్ప కోసం ఐదేళ్లపాటు గుబురు గడ్డంతో కనిపించిన బన్నీ అట్లీ కోసం స్టైలిష్ లుక్‌లోకి వచ్చేశాడు. పునర్జన్మ కాన్సెప్ట్‌తో సైన్స్ ఫిక్షన్ మూవీ కథను అట్లీ రెడీ చేశాడట. కొత్తప్రపంచాన్ని సృష్టించడానికి హాలీవుడ్ టెక్నీషిన్స్తో వర్క్ చేస్తున్నాడు అట్లీ. భారీ విఎఫ్ఎక్స్ వర్క్‌తో రూపొందుతున్న ఈ సినిమాను రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. AA 26లో హీరోయిన్గా ఆల్రెడీ దీపిక పదుకునేను సెలెక్ట్ చేశారు. మరో ఇద్దరు హీరోయిన్స్‌గా రష్మికతో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వి కపూర్ నటిస్తుంన్నారు. ప్రస్తుతం నడుస్తున్న ముంబయి షెడ్యూల్ పూర్తికాగానే మరో హీరోయిన్ని ఎనౌన్స్ చేస్తూ స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తారట.
Also Read
- Balka Suman: బాల్క సుమన్‌కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- ‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
తాజావార్తలు
-
RCB vs GT Final: ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే.. ఐపీఎల్ 2026 విజేత ఎవరు?.. పూర్తి వివరాలు ఇవే!
-
RCB Playing XI: గుజరాత్ టైటాన్స్‌ను దెబ్బకొట్టేందుకు ఆర్సీబీ పక్కా ప్లాన్.. టీమ్‌లో బిగ్ ఛేంజ్..
-
Premalu 2 : ప్రేమలు 2కి కథ లేదు అందుకే క్యాన్సిల్ చేసాం : నస్లీన్
-
NBK Lineup : తమిళ డైరెక్టర్ తో నందమూరి నటసింహం సినిమా ఫిక్స్?
-
IPL 2026 Final: బెంగళూరుకు బిగ్ షాక్.. గుజరాత్ టైటాన్స్‌దే ఐపీఎల్ 2026 టైటిల్?
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..