NTV Telugu Site icon

Emotionally Reactive: చిన్న ఎమోషన్‎కు కూడా అతిగా రియాక్ట్ అవుతున్నారా.. అయితే ఇలా చేయండి

Emotional

Emotional

Emotionally Reactive: కొన్ని కొన్ని సార్లు చిన్న ఎమోషన్ కు కూడా మనం అతిగా రియాక్ట్ అవుతుంటాం. ఇది మనకు తెలియకుండానే జరిగిపోతుంటుంది. దీని వల్ల మన ఎదుటివారి మనసు బాధపడుతుంటుంది. అంతా అయ్యాక ఆలోచించుకుంటే.. అరె అలా అనాల్సింది కాదు అనుకుంటూ ఉంటాం. కానీ అప్పటికీ జరిగిపోవాల్సింది జరిగిపోతుంది. ఆ వ్యక్తి మనసులో మనపై ఓ రకమైన నెగిటివ్ ఒపీనియన్ ఏర్పడుతుంది. కావున మనం మాట్లాడే ముందే మన భావోద్వేగాలను కంట్రోల్ చేసుకుంటే బంధాలు నిలబడతాయి.

Read Also: Notice to God : స్థలం ఖాళీ చేయాలంటూ హనుమంతుడికి నోటీసులు

ఎమోషనల్‌గా రియాక్టవడం వల్ల ఫలితం ఉండకపోగా.. మీ మధ్య బంధం బీటలు వారుతుంది. మీ భావోద్వేగాలకు అవతలి వారు పట్టించుకుంటారనుకోవడం పొరపాటే. అందువల్ల మీ చెప్పదలుచుకున్న స్పందనను మీ ఎమోషన్స్ తగ్గించుకుని చెప్పండి. మీ ఎమోషన్స్ నియంత్రించేందుకు కొంత ప్రాక్టీస్ అవసరం. దీనిని ప్రస్తావిస్తూ సైకాలజిస్ట్ నికోల్ లెపెరా కొన్ని టెక్నిక్స్ వివరించారు.

Read Also: Telangana Loan: తెలంగాణ రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉందా తెలుసా?

ఎమోషనల్‌గా అతిగా రియాక్ట్ కాకూడదంటే కొన్ని సూచనలు పాటించాలి.. మనం అతిగా ఎమోషనల్ అయిన ప్రతీసారి.. ప్రతిస్పందించే ముందు కాస్త విరామం తీసుకోవాలి. అప్పుడు ఆలోచన కాస్త కుదుట పడి మనం అనుభూతి చెందుతున్న విధానాన్ని అర్థం చేసుకోగలుగుతాం. ఇది మన ఆలోచనలను కూడగట్టుకోవడానికి, ప్రతిస్పందించడానికి ముందు మనల్ని మనం కంట్రోల్ చేసుకునేందుకు సహాయపడుతుంది. అలాగే భావోద్వేగ సందర్భాలలో శరీరం ఓ రకమైన కంపనలకు గురవుతుంది. కడుపులో వికారం నుండి మొదలు గుండె దడ, గుండె వేగంగా కొట్టుకోవడం వరకు… వాటిని గుర్తించి శ్రద్ధ పెట్టడం అవసరం. కోపం వచ్చిన వెంటనే కాసేపు ఆగి శ్వాసను గట్టిగా తీసుకోవాలి. దీంతో శరీరం ప్రశాంతంగా ఉంటుంది. ఈ క్రమంలోనే అంకెలను లెక్కిస్తే ఇంకా మంచిది. నాడీ వ్యవస్థను తిరిగి సమతుల్యం చేయడానికి నవ్వడం, ఏడ్చడం లేదా ఇతరత్రా పనులు ప్రాక్టీస్ చేయాలి. ఎదుటివారు అన్న వెంటనే సందర్భానికి రియాక్టవడం కాకుండా, విరామం తీసుకొని దానికి స్పందించడం ముఖ్యం.