Health Tips: కిడ్నీలో రాళ్లు కరగడానికి బెస్ట్ రెమిడీ.. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మానవ శరీరంలో కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేస్తూ, వ్యర్థాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, శరీరంలో నీటి శాతం తగ్గి లవణాలు పేరుకుపోయినప్పుడు అవి రాళ్లుగా మారుతుంటాయి. మారిన జీవనశైలి, తగినంత నీరు తాగకపోవడం, జంక్ ఫుడ్స్ వంటి అలవాట్ల వల్ల నేడు చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. 5 మిలీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉన్న చిన్న రాళ్లను కొన్ని ఇంటి చిట్కాల ద్వారా సులభంగా బయటకు పంపవచ్చు.
రోజుకు కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు తాగడం వల్ల మూత్రం పలచబడుతుంది. ఇది కొత్తగా రాళ్లు ఏర్పడకుండా నిరోధించడమే కాకుండా, ఇప్పటికే ఉన్న చిన్న రాళ్లను మూత్రం ద్వారా బయటకు నెట్టేస్తుంది. అంతే కాకుండా.. నిమ్మకాయలో ఉండే సిట్రేట్ క్యాల్షియం రాళ్లను విచ్ఛిన్నం చేయడానికి దోహదపడుతుంది. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కొబ్బరి నీళ్లలో లభించే పొటాషియం, సిట్రేట్ ఖనిజ లవణాలు ఒకదానితో ఒకటి కలిసి రాళ్లుగా మారకుండా చూస్తాయి. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచి, కిడ్నీల్లోని స్పటికాలను తొలగిస్తుంది.
Also Read
- Gold Silver Price Today: పడిపోతున్న పసిడి ధర.. వరుసగా రెండో రోజూ భారీగా డౌన్
- 12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
- October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
- Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
బార్లీ గింజలను నీటిలో బాగా మరిగించి వడకట్టుకుని తాగడం వల్ల మూత్ర విసర్జన పెరుగుతుంది. ఇది కిడ్నీలపై ఒత్తిడిని తగ్గించి, టాక్సిన్స్‌ను మరియు చిన్న రాళ్లను సులభంగా బయటకు పంపుతుంది. వీటితో పాటు.. ముల్లంగి, ఉల్లిపాయ రసాలు కూడా రాళ్లు ఏర్పడకుండా కాపాడుతాయి. అయితే ఇవి ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, అవి రాళ్లను కరిగిస్తాయనడానికి స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే ఇవన్నీ ప్రాథమిక జాగ్రత్తలు మాత్రమే. ఒకవేళ కిడ్నీ సమస్య తీవ్రంగా ఉండి, విపరీతమైన నొప్పి, వాంతులు లేదా మూత్రంలో రక్తం పడటం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్య నిపుణులను సంప్రదించడం ఎంతో ముఖ్యం.
తాజావార్తలు
-
Ramayana Part 1 Title: రణ్‌బీర్ కపూర్ బర్త్‌డే సర్ప్రైజ్.. ‘రామాయణ’ పార్ట్ 1 టైటిల్ ఇదే!
-
Share Nani: ఒక్క సినిమాకే సరిపోయింది.. మళ్లీ ‘నేచురల్ స్టార్’గానే నాని!
-
Gold Silver Price Today: పడిపోతున్న పసిడి ధర.. వరుసగా రెండో రోజూ భారీగా డౌన్
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!