NTV Telugu Site icon

Healthy Food: పోషకాలకు పుట్టినిల్లు ఈ ఆహార పదార్ధాలు

New Project (7)

New Project (7)

Healthy Food: భారతదేశంలో నాన్ వెజ్ తినే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. కరోనా మహమ్మారి కారణంగా ప్రోటీన్లు అత్యధికంగా కావాలంటూ అందరూ మాంసం తినడం అలవాటు చేసుకుంటున్నారు. మాంసం, చేపలు, గుడ్లు ఇలా అత్యధిక ప్రోటీన్ పదార్థాలను తీసుకుంటూ.. ఆరోగ్యంపై శ్రద్ధ కనబరుస్తున్నారు. అయితే దేశంలో మాంసాహారులతో పాటు శాకాహారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారంతా ప్రోటీన్ల కోసం మాంసాన్ని తినలేరు. అటువంటి పరిస్థితిలో, శాకాహారులు తమ ప్రోటీన్ అవసరాలను ఎలా తీర్చుకోవాలన్న సందేహంలో ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ పోషకాహార నిపుణులు కొన్ని కూరగాయలు తినడం వల్ల కూడా అత్యధిక ప్రోటీన్లు శరీరానికి అందుతాయని సూచించారు. వాటిలో కొన్ని..

కాలీఫ్లవర్
కాలీఫ్లవర్ తినడం వల్ల శరీరానికి ప్రొటీన్లు లభిస్తాయి. పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ లభిస్తాయని కొద్ది మందికి తెలుసు. దీన్ని క్రమం తప్పకుండా తింటే, శరీరానికి ప్రోటీన్ కొరత తీరుతుంది.

ఆకుకూరలు
ఆకు కూరలు పోషకాహారంగా పరిగణించబడతాయి. ఇది ప్రోటీన్ కలిగి ఉంటుంది. B విటమిన్లు, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి పాలకూరను క్రమం తప్పకుండా తీసుకోవాలి.

బంగాళదుంపలు
బంగాళదుంపలు తినడం వల్ల ఈ ప్రొటీన్లు లభిస్తాయి. అయితే అందుకు తరిగిన బంగాళదుంపలను తక్కువ వేడి మీద వేయించాలి. ప్రొటీన్‌తో పాటు ఫైబర్, విటమిన్ సి, పొటాషియం కూడా లభిస్తాయి.

బ్రోకలీ
మాంసం, గుడ్లు తినడం ఇష్టం లేకపోతే, మీరు బ్రకోలీ తినడం ప్రారంభించవచ్చు. ఇది ప్రోటీన్‌తో పాటు ఐరన్‌ను అందించే ఆరోగ్యకరమైన కూరగాయలు. దీన్ని ఉడకబెట్టడం లేదా సలాడ్‌గా తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

పుట్టగొడుగు
పుట్టగొడుగులు ఖరీదైన ఎంపిక, కానీ ప్రోటీన్లకు మూలంగా పరిగణించబడతాయి. ఇలా వారానికి 5 నుంచి 3 సార్లు తింటే శరీరంలో ప్రొటీన్లు, మరెన్నో పోషకాల లోపం ఉండదు.

Show comments