NTV Telugu Site icon

America Visa: అమెరికన్ వీసా పొందడానికి దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?

America Visa

America Visa

America Visa: అమెరికా వెళ్లాలని కలలు కనే వారికి ముఖ్యంగా కావలిసింది వీసా. యుఎస్ వీసా పొందే ప్రక్రియ కొంచెం కష్టంగా ఉంటుంది. ముందుగా దానిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అమెరికా వీసాను ఎలా పొందాలన్న విషయాన్ని తెలుసుకుందాము. ముందుగా అమెరికాను సందర్శించడానికి అనేక రకాల వీసాలు అందుబాటులో ఉన్నాయి. అవేంటంటే..

వ్యాపార వీసా (B-1): వ్యాపార ప్రయోజనాల కోసం .

టూరిస్ట్ వీసా (B-2): మీరు కుటుంబాన్ని సందర్శిస్తున్నట్లయితే లేదా ఆ దేశము సందర్శిస్తున్నట్లయితే .

అకడమిక్ వీసా (F-1): చదువుకోవడానికి .

వర్క్ వీసా (H-1B): అమెరికాలో పని చేయడానికి .

Rashid Khan: ఘనంగా పెళ్లిచేసుకున్న స్టార్ అల్ రౌండర్.. హాజరైన క్రికెటర్లు!

అమెరికా వీసా కోసం దరఖాస్తు చేయడానికి, మీరు ముందుగా US స్టేట్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌కి వెళ్లాలి. అక్కడ మీరు DS-160 ఫారమ్‌ను పృథి చేయాలి. దానిని ఆన్‌లైన్‌లో నింపి సమర్పించాలి. ఫారమ్ నింపిన తర్వాత, మీరు వీసా దరఖాస్తు రుసుమును చెల్లించాలి. వీసా రకాన్ని బట్టి ఈ రుసుము మారవచ్చు . సాధారణంగా, ఇది దాదాపు 160 – 190 డాలర్ల వరకు ఉంటుంది. ఆ తర్వాత, మీరు మన దేశ యుఎస్ ఎంబసీ లేదా కాన్సులేట్ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఇంటర్వ్యూని షెడ్యూల్ చేసుకోవాలి.

వీసా దరఖాస్తు కోసం అవసరమైన పత్రాల జాబితాను రూపొందించుకోవాలి. వీటిలో పాస్‌పోర్ట్ , ఫోటోలు , ప్రయాణ ప్రణాళికలు, అవసరమైతే ఆర్థిక పత్రాలు కూడా ఉంటాయి . ఇక ఇంటర్వ్యూ సమయంలో, ఒక అధికారి మిమ్మల్ని అమెరికాకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు.? మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి.? అలాగే తిరిగి రావడానికి మీ ప్రణాళికలు ఏమిటి వంటి ప్రశ్నలు అడుగుతారు. వాటికి మీరు నిజాయితీగా సమాధానం చెప్పడం ముఖ్యం.

Train Derailed: రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన పెట్రోలియం ఉత్పత్తులతో వెళ్తున్న గూడ్స్ రైలు!

ఇక ఆ ఇంటర్వ్యూ తర్వాత అధికారి మీ దరఖాస్తును ఆమోదిస్తారు లేదా తిరస్కరిస్తారు. మీ వీసా ఆమోదించబడినట్లయితే, మీరు మీ పాస్‌పోర్ట్‌ను ఎంబసీ నుండి అందుకుంటారు. అందులో వీసా స్టాంప్ ఉంటుంది. ఇక వీసాల మంజూరుకు ఫీజుల పేరుతో తీసుకున్న డబ్బు ఎవరి జేబులోకి వెళ్తుందనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే అది రాయబార కార్యాలయానికి లేదా కాన్సులేట్‌కు వెళుతుంది. దీని తర్వాత ఈ రుసుము అమెరికన్ ప్రభుత్వానికి వెళుతుంది. ఈ రుసుము వీసా ప్రాసెసింగ్, భద్రతా తనిఖీలు, ఇతర పరిపాలనా ఖర్చుల కోసం ఉపయోగించబడుతుంది. అలాగే మీరు ఏదైనా ఏజెన్సీ సహాయం తీసుకుంటే మీరు దానికి కూడా రుసుము చెల్లించాలి. అయితే , ఇది మీ అవసరాన్ని బట్టి మీరు నిర్ణయించుకోవాలి.

Show comments