Aadhaar Card Safe: ఆధార్ కార్డు దుర్వినియోగం అవుతుందని అనుమానమా? అయితే ఇలా చెక్ చేసుకోండి
- ఆధార్ కార్డు మనదేశంలో అత్యంత కీలకమైన గుర్తింపు కార్డు.
- మీ ఆధార్‌ను ఎవరైనా అనుమతి లేకుండా వాడుతున్నారా లేదా అని అనుమానమా ?
- అయితే తరచూ చెక్ చేసుకోవడం అవసరం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aadhaar Card Safe: ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డు మనదేశంలో అత్యంత కీలకమైన గుర్తింపు కార్డు. కొత్త బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా, సిమ్ కార్డు తీసుకోవాలన్నా, ప్రభుత్వ పథకాలు పొందాలన్నా ఒకేఒక్క ఆధారం ఆధార్ కార్డు. అయితే, మీ ఆధార్ కార్డును ఎవరైనా దుర్వినియోగం చేస్తున్నారా అని అనుమానమా? లేదా మీ పేరు మీద అకౌంట్లు తెరవడం, సిమ్ కార్డులు కొనడం, ఇతర మోసాలు చేయడం సాధ్యమే. అందుకే మీ ఆధార్‌ను ఎవరైనా అనుమతి లేకుండా వాడుతున్నారా లేదా అని తరచూ చెక్ చేసుకోవడం అవసరం. UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) అందిస్తున్న ఆధార్ హిస్టరీ ఫీచర్ ద్వారా, మీ ఆధార్ ఎక్కడెక్కడ వాడారో తెలుసుకోవచ్చు. ఇది రీసెంట్‌గా జరిగిన లావాదేవీలను చెక్ చేసి, అనుమానాస్పద వాటిని గుర్తించే అవకాశాన్ని కల్పిస్తుంది.
Also Read: AP Registration: రిజిస్ట్రేషన్లపై కీలక నిర్ణయం.. ఏపీలో అమల్లోకి కొత్త విధానం..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఇక మీ ఆధార్ హిస్టరీని ఎలా చెక్ చేసుకోవడం ఎలాగంటే.. UIDAI అధికారిక వెబ్‌సైట్ uidai.gov.in కి వెళ్లి, మీ 12 డిజిట్ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, కింద ఉన్న క్యాప్చా కోడ్‌ను ఇవ్వండి. ఆపై మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఆ తర్వాత Authentication History సెక్షన్‌కి వెళ్లండి. అక్కడ మీరు ఆధార్ ట్రాన్సాక్షన్ హిస్టరీని చూసుకోవచ్చు. మీకు తెలియని లావాదేవీలు కనిపిస్తే, అవి అనుమానాస్పదమైనవేమో గమనించండి. అందులో మీ ఆధార్‌తో సంబంధం లేని ట్రాన్సాక్షన్స్ కనిపిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి.
మొదటగా UIDAI హెల్ప్‌లైన్ (1947) నంబర్‌కు కాల్ చేయండి. లేదా help@uidai.gov.in మెయిల్ పంపండి. మీ బ్యాంక్ అకౌంట్ లేదా సిమ్ కార్డు ద్వారా మోసం జరిగిందనిపిస్తే, సంబంధిత బ్యాంక్ లేదా మొబైల్ సర్వీస్ ప్రొవైడర్‌కి వెంటనే సమాచారం ఇవ్వండి. దీని తర్వాత UIDAI అందిస్తున్న బయోమెట్రిక్ లాక్ ఫీచర్ ద్వారా మీ ఆధార్‌ను సెక్యూర్‌గా ఉంచుకోవచ్చు. ఇందుకోసం UIDAI వెబ్‌సైట్‌కి వెళ్లి “లాక్/అన్‌లాక్ బయోమెట్రిక్స్” ఆప్షన్ సెలెక్ట్ చేయండి.
ఆధార్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేసి OTP ద్వారా లాగిన్ అవ్వండి. మీ బయోమెట్రిక్ డేటాను లాక్ చేయండి. మీరు అన్‌లాక్ చేసే వరకు మీ వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ ఉపయోగించబడలేవు.
Also Read: Mahesh Babu : రీ-రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’..?
మొత్తానికి మీ ఆధార్ హిస్టరీని తరచూ చెక్ చేయడం అలవాటు చేసుకోండి. ముఖ్యంగా మీ బయోమెట్రిక్ డేటాను లాక్ చేయడం ద్వారా దుర్వినియోగంను నివారించవచ్చు. ఏదైనా అనుమానాస్పద లావాదేవీలు కనిపిస్తే వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే, మీ ఆధార్‌ను మోసాల నుంచి కాపాడుకోవడం మాత్రమే కాదు, మీ వ్యక్తిగత వివరాలను సురక్షితంగా ఉంచుకోవచ్చు.
తాజావార్తలు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!