NTV Telugu Site icon

Aadhaar Card Safe: ఆధార్ కార్డు దుర్వినియోగం అవుతుందని అనుమానమా? అయితే ఇలా చెక్ చేసుకోండి

Aadhar

Aadhar

Aadhaar Card Safe: ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డు మనదేశంలో అత్యంత కీలకమైన గుర్తింపు కార్డు. కొత్త బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా, సిమ్ కార్డు తీసుకోవాలన్నా, ప్రభుత్వ పథకాలు పొందాలన్నా ఒకేఒక్క ఆధారం ఆధార్ కార్డు. అయితే, మీ ఆధార్‌ కార్డును ఎవరైనా దుర్వినియోగం చేస్తున్నారా అని అనుమానమా? లేదా మీ పేరు మీద అకౌంట్లు తెరవడం, సిమ్ కార్డులు కొనడం, ఇతర మోసాలు చేయడం సాధ్యమే. అందుకే మీ ఆధార్‌ను ఎవరైనా అనుమతి లేకుండా వాడుతున్నారా లేదా అని తరచూ చెక్ చేసుకోవడం అవసరం. UIDAI (యూనిక్‌ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) అందిస్తున్న ఆధార్ హిస్టరీ ఫీచర్ ద్వారా, మీ ఆధార్ ఎక్కడెక్కడ వాడారో తెలుసుకోవచ్చు. ఇది రీసెంట్‌గా జరిగిన లావాదేవీలను చెక్ చేసి, అనుమానాస్పద వాటిని గుర్తించే అవకాశాన్ని కల్పిస్తుంది.

Also Read: AP Registration: రిజిస్ట్రేషన్లపై కీలక నిర్ణయం.. ఏపీలో అమల్లోకి కొత్త విధానం..

ఇక మీ ఆధార్ హిస్టరీని ఎలా చెక్ చేసుకోవడం ఎలాగంటే.. UIDAI అధికారిక వెబ్‌సైట్‌ uidai.gov.in కి వెళ్లి, మీ 12 డిజిట్ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, కింద ఉన్న క్యాప్చా కోడ్‌ను ఇవ్వండి. ఆపై మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఆ తర్వాత Authentication History సెక్షన్‌కి వెళ్లండి. అక్కడ మీరు ఆధార్ ట్రాన్సాక్షన్ హిస్టరీని చూసుకోవచ్చు. మీకు తెలియని లావాదేవీలు కనిపిస్తే, అవి అనుమానాస్పదమైనవేమో గమనించండి. అందులో మీ ఆధార్‌తో సంబంధం లేని ట్రాన్సాక్షన్స్ కనిపిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి.

మొదటగా UIDAI హెల్ప్‌లైన్ (1947) నంబర్‌కు కాల్ చేయండి. లేదా help@uidai.gov.in మెయిల్ పంపండి. మీ బ్యాంక్ అకౌంట్ లేదా సిమ్ కార్డు ద్వారా మోసం జరిగిందనిపిస్తే, సంబంధిత బ్యాంక్ లేదా మొబైల్ సర్వీస్ ప్రొవైడర్‌కి వెంటనే సమాచారం ఇవ్వండి. దీని తర్వాత UIDAI అందిస్తున్న బయోమెట్రిక్ లాక్ ఫీచర్ ద్వారా మీ ఆధార్‌ను సెక్యూర్‌గా ఉంచుకోవచ్చు. ఇందుకోసం UIDAI వెబ్‌సైట్‌కి వెళ్లి “లాక్/అన్‌లాక్ బయోమెట్రిక్స్” ఆప్షన్ సెలెక్ట్ చేయండి.
ఆధార్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేసి OTP ద్వారా లాగిన్ అవ్వండి. మీ బయోమెట్రిక్ డేటాను లాక్ చేయండి. మీరు అన్‌లాక్ చేసే వరకు మీ వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ ఉపయోగించబడలేవు.

Also Read: Mahesh Babu : రీ-రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’..?

మొత్తానికి మీ ఆధార్ హిస్టరీని తరచూ చెక్ చేయడం అలవాటు చేసుకోండి. ముఖ్యంగా మీ బయోమెట్రిక్ డేటాను లాక్ చేయడం ద్వారా దుర్వినియోగంను నివారించవచ్చు. ఏదైనా అనుమానాస్పద లావాదేవీలు కనిపిస్తే వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే, మీ ఆధార్‌ను మోసాల నుంచి కాపాడుకోవడం మాత్రమే కాదు, మీ వ్యక్తిగత వివరాలను సురక్షితంగా ఉంచుకోవచ్చు.