Site icon NTV Telugu

Drunk Man: ఎంత తాగావ్ రా నాయనా..? డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో ఏకంగా 550 పాయింట్లు అవాక్కయిన పోలీసులు

New Project (10)

New Project (10)

Drunk Man: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఇక మందుబాబులైతే బాగా చుక్కేసి చిందులు వేసినట్లు తెలుస్తోంది. ఐటీ కారిడార్‌లో మాత్రం ఆడా, మగా అనే తేడా లేకుండా ఫుల్లుగా మద్యం తాగి రోడ్లపై విచ్చలవిడిగా సంచరిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఇక ముందుగా హెచ్చరించినట్లుగానే పోలీసులు సిటీ వ్యాప్తంగా డ్రంకెన్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. అందులో ఓ మందుబాబును టెస్టు చేయగా ఏకంగా 550 పాయింట్లు నమోదయ్యాయి. దీంతో పోలీసులే ఒక్కసారిగా షాక్ అవ్వాల్సి వచ్చింది. వెంటనే అతడిని బైక్ సీజ్ చేసి రిసిప్ట్ ఇచ్చి పోలీసులు పంపించారు. ఇలా నిన్న రాత్రి నిర్వహించిన బ్రీత్ అనలైజర్ టెస్టుల్లో చాలా మంది పట్టుబడినట్లు తెలుస్తోంది.

Read Also:PDS Rice Case: మాజీ మంత్రి పేర్ని నాని సతీమణికి మరోసారి నోటీసులు!

సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను నియంత్రించడానికి పోలీసులు చెకింగులు చేస్తుంటారు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే మాత్రం కేసులు పెట్టడం కామన్. ఎవరైనా తాగి బైక్ లేదా ఇతర వాహనాలు నడుపుతున్నట్లు పోలీసులకు అనుమానం వస్తే వెంటనే వారిని ఆపి బ్రీత్ ఎనలైజర్ ద్వారా టెస్ట్ చేస్తారు. 100 మి.లీ రక్తంలో ఎంత ఆల్కహల్ శాతం ఉందనేది లెక్కించి 30 మి.గ్రాములు దాటితే పోలీసులు కేసు పెడతారు. సాధారణంగా వంద మి.లీ రక్తంలో 50 మి.గ్రాముల ఆల్కహల్ శాతం ఉంటే ఆ వ్యక్తి స్పృహాలో లేనట్లుగా గుర్తిస్తారు. బ్రీత్ అనలైజర్‌లో వందకు మించి ఆల్కహల్ శాతం నమోదైన సందర్భాలు లేకపోలేదు. కానీ మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని పంజాగుట్ట సమీపంలో జరిగిన ఓ సంఘటన పోలీసులతో పాటు జనాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది. పంజాగుట్ట సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని ఆపి బ్రీత్ ఎనలైజర్ పెట్టి గాలి ఊదమన్నారు. ఆ వ్యక్తి గాలి ఊదగానే బ్రీత్ ఎనలైజర్ మిషన్ సైతం వణికిపోయింది. బ్రీత్ ఎనలైజర్‌లో ఏకంగా 550 రీడింగ్ నమోదుకావడంతో అంతా షాక్ అవుతున్నారు.

Read Also:Food Safety Rides: కొంపల్లిలో పలు రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

31 డిసెంబర్ 2024 రాత్రి 10.50 గంటల సమయంలో పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1, వెంగళరావు పార్క్ సమీపంలో తనిఖీలు నిర్వహించారు. ఆ మార్గంలో TS09EK3617 బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని పోలీసులు ఆపి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేశారు. 550 ఆల్కహాల్ రీడింగ్ నమోదైంది. రీడింగ్ చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. బైక్ సీజ్ చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు. TS09EK3617 బైక్‌పై 31 డిసెంబర్ 2024 ఉదయం 9.17 గంటలకు హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తున్న కేసు నమోదైంది. అదే బైక్‌పై రాత్రి 10.53 గంటలకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదైంది. ఉదయం హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చేస్తున్నారంటూ ఆషిఫ్‌ నగర్ ట్రాఫిక్ పోలీసుల ఫైన్ వేయగా.. రాత్రి పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులకు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డారు. ఇప్పటి వరకు ఈ బైక్‌పై పది చలనాలు పెండింగ్ ఉండగా.. ఇవ్వన్నీ కూడా హెల్మెట్ లేనందుకు వేసినవే.

Exit mobile version